Today Horoscope: ఓ రాశివారికి ప్రతి పనిలో అడ్డంకులే..!

First Published | Nov 20, 2023, 4:24 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీనతా ఉంటుంది. ఓం మహీసుతాయ నమః అని జపించండి.

Sun visible in Cancer sign


20-11-2023, సోమవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
పంచాంగం
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               
తేది :  20నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం    
సోమవారం
తిథి :- అష్టమి తె.3.15 ని॥వరకు
నక్షత్రం:-  ధనిష్ఠ రాత్రి 10.15 ని॥వరకు
యోగం:- ధృవము రాత్రి 10.5 ని॥వరకు
కరణం:- విష్టి(భద్ర) సా॥4.26 బవ తె.3.15 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥12.32 ని॥ల 2.02 ని॥వరకు
దుర్ముహూర్తం:- ప॥ 12:07ని॥ల ప॥ 12:57 ని॥వరకు  తిరిగి మ॥ 02:21 ని॥ల మ॥03:06 ని॥వరకు
వర్జ్యం:- తె.4.57 ని॥ల
రాహుకాలం:- ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం:- ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :-  6.09ని॥లకు
సూర్యాస్తమయం:-  5.21ని॥లకు

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
భరణి నక్షత్రం వారికి (క్షేమతార)
కృత్తిక నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి. మానసికంగా బలహీనతా ఉండును. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించవలెను. చేయని పొరపాటులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలెను. విద్యార్థులు చదువుపై శ్రద్ధ తీసుకోవాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. ఉద్యోగాలలో సహోద్యోగులతో కలహాలు రాగలవు. ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.


telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార)
రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార)
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)

దిన ఫలం:-పట్టుదలతో చేసిన పనులు పూర్తి అగును. వ్యవహారములలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాలి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనుకోని సమస్యలు ఏర్పడి బాధ కలిగించును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీనతా ఉంటుంది. ఓం మహీసుతాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మ తార)
ఆరుద్ర నక్షత్రం వారికి (పరమైత్రతార)
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)

దిన ఫలం:-విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం లభించును. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంటా బయటా ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది.తలపెట్టిన సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఉద్యోగాలలో అధికారాల స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు ఓం వాచస్పతయే నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (మిత్ర తార)
పుష్యమి నక్షత్రం వారికి  (నైధన తార)
ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు.అభివృద్ధి విషయాలు ఇతరులతో ఆలోచనలు చేస్తారు.కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అధికారులతో పరిచయాలు కలిసి వస్తాయి.ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది.మిత్రుల సహాయ సహకారాలు లభించును. ఓం శుభప్రదాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమ తార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. సమాజములో మీ మాటకు విలువ పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగించును. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానములు పొందగలరు. ఓం సదాశివాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (విపత్తార):-
హస్త నక్షత్రం వారికి  (సంపత్తార):-
చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార):-

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలలో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఎన్ని అవాంతరాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేయవలెను. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరు ఉపశమనం లభిస్తుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి తగ్గి ప్రశాంతత పొందుతారు. ఓం నీలకంఠాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (జన్మ తార)
స్వాతి నక్షత్రం వారికి (పరమైత్ర తార)
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి  వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది.సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది . తల పట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఓం షణ్ముఖాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (మిత్ర తార)
అనూరాధ నక్షత్రం వారికి  (నైధనతార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (సాధన తార)

దిన ఫలం:-అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి. ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడడం వలన కొత్త సమస్యలు వస్తాయి. మనస్సు నందు అనేకమైన ఆలోచనతో ఆందోళనగా ఉంటుంది.బంధు మిత్రులతో మనస్పర్ధలు రాగలవు.ఇతరులతో వాదన వేయడం మంచిది కాదు.ఓం శ్రీ రాహు మూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
పూ.షా నక్షత్రం వారికి (క్షేమ తార)
ఉ.షా నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-శారీరకంగా బలహీనంగా ఉంటుంది. అకారణంగా కలహాలు రాగలవు . కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావారణం . ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు తారుమారు అవుతాయి. సన్నిహితులతో వాదోపవాదములకు దూరంగా ఉండాలి . ప్రతి పనిలో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి . సహకరించే వ్యక్తులు దూరంగా ఉంటారు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షా నక్షత్రం వారికి (విపత్తార)
శ్రవణం నక్షత్రం వారికి  (సంపత్తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములలో సామాన్యమైన లాభం కలుగును.అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. అనవసరమైన ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఓం భవాన్యై నమః అని జపించండి .శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (జన్మ తార)
శతభిషం నక్షత్రం వారికి (పరమైత్ర ఎతార)
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)

దిన ఫలం:-ఇతరుల యొక్క విషయాలలో దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసు కొనివలెను. పనులలో ఆసక్తి లేకుండా ఉండుట. పనివారితో ఇబ్బందులు పడతారు . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజములో  అవమానములు కలుగును. మనస్సులో ఆందోళనగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి . స్నేహితులతో మాట పట్టింపులు రాగలవు. ఆవేశాన్ని అదుపులో ఉంచు కొనివలెను . వృత్తి వ్యాపారములలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది . ఓం రుద్రాయ నమః అని  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి  (మిత్ర తార)
ఉ.భా  నక్షత్రం వారికి  (నైధన తార)
రేవతి నక్షత్రం  వారికి  (సాధన తార)

దిన ఫలం:-ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ధన లాభం పొందుతారు.కీలకమైన సమస్యల నుండి విముక్తి పొందవచ్చును .అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు . పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఓం చంద్రాయ నమః అని జపించండి. శుభ ఫలితాలను పొందండి.

Latest Videos

click me!