Today Horoscope: ఓ రాశివారికి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి

First Published Mar 15, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారు ఈ రోజు.. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. 
 

Horoscope 2024

15-3-2024, శుక్రవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార)తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త అవసరం.ఆలోచించి ఖర్చు చేయవలెను.

భరణి నక్షత్రం వారికి(సంపత్తార) బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

కృత్తిక నక్షత్రం వారికి(జన్మతార)అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులు తో అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-బంధు సౌఖ్యం లభిస్తుంది.ఉద్యోగాలలో అధికార అభివృద్ధి.కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు.అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.వ్యవహారాల్లో ఆటంకాలు లేకుండా పూర్తి చేసు కుంటారు.
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి(పరమైత్రతార)ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.పనులలో ఆటంకాలు. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు.ఖర్చులు ఆలోచించి చేయవలెను.

మృగశిర నక్షత్రం వారికి(మిత్ర తార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి .చేయు వ్యవహారంలో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి.మానసిక అశాంతి ఏర్పడుతుంది.బంధువర్గము ద్వారా అనేక అవరోధాలు ఏర్పడవచ్చు. అనారోగ్యం కారణంగా ఇబ్బంది కలుగును. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాగలవు.

telugu astrology

t

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి(నైధనతార)మానసిక ఆందోళన.పనులలో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి.సమాజంలో అపవాదము రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు.గౌరవ మర్యాదలు పొందగలరు.వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది.జీవిత భాగస్వామి తో అకారణ కలహాలు రావచ్చు.సమాజంలో ప్రతికూలత వాతావరణం.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణము చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా మెలగాలి.బంధుమిత్రులతో అకారణ కలహాలు రాగలవు.వస్తువులు జాగ్రత్త.

ఆశ్రేష నక్షత్రం వారికి(క్షేమతార) వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అధికారులు ఆదరణ పొందగలరు. ధనలాభం.

దిన ఫలం:-అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఉద్యోగ పరంగా అభివృద్ధి కనపడను.సంసార సౌఖ్యం లభిస్తుంది.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.
 

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి(విపత్తార)తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త అవసరం.ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి(సంపత్తార) బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులు తో అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు రాగలవు.వ్యాపారం సజావుగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి(పరమ మిత్ర తార)ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు.ఖర్చులు ఆలోచించి చేయవలెను.

చిత్త నక్షత్రం వారికి(మిత్ర తార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-పుత్రులతో ప్రతికూలత వాతావరణ.బంధువర్గంతో అకారణంగా కలహాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మానసికంగా నిరుత్సాహంగా ఉంటుంది.శారీరక శ్రమ పెరిగి అలసట పొందుతారు.ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.మిత్రులతో సఖ్యంగా వ్యవహరించాలి.

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (నైధనతార)మానసిక ఆందోళన.పనులలో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి.సమాజంలో అపవాదము రాగలవు.

విశాఖ నక్షత్రం వారికి(సాధన తార)మానసిక ఆనందం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును.ఆర్థికంగా బాగుంటుంది.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. క్లిష్టమైన సమస్యలు ను చాకచక్యంగా ఎదుర్కొంటారు.గృహంలో శుభకార్యములు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అన్ని విధాల అభివృద్ధి కనిపించను.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి(ప్రత్యక్తార) ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా మెలగాలి.బంధుమిత్రులతో అకారణ కలహాలు రాగలవు.వస్తువులు జాగ్రత్త.

జ్యేష్ట నక్షత్రం వారికి(క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అధికారులు ఆదరణ పొందగలరు.ధనలాభం.

దిన ఫలం:-ఆరోగ్యం బాగుంటుంది.అభివృద్ధి కార్యక్రమాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం బాగుంటుంది.చిన్న సమస్యల వలన కోపో ఉద్రేకాలకు గురవుతారు.వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.
 

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి(విపత్తార)తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త అవసరం.ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.షాఢ నక్షత్రం వారికి(సంపత్తార) బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

ఉ.షాఢ నక్షత్రం వారికి(జన్మతార)అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులు తో అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-వివాహాది శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.వైవాహిక  జీవితం ఆనందంగా గడుపుతారు.దూర ప్రయాణాలు లాభిస్తాయి.ఉద్యోగులకు అనుకూలం.ప్రతి చిన్న సమస్య ను ధైర్యంగా ఎదుర్కొంటారు.అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
 

telugu astrology


మకర (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి(పరమ మిత్ర తార) ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు.ఖర్చులు ఆలోచించి చేయవలెను.

ధనిష్ఠ నక్షత్రం వారికి(మిత్ర తార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కలుగును.మిత్రులతో విరోధం.ఉద్యోగాలలో  అధికారులు తో సమస్యలు.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు.మానసికంగా ఆందోళన గా ఉంటుంది.శత్రు బాధలు పెరగవచ్చు.కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.తలపెట్టిన పనుల్లో అపజయాలు.విద్యార్థులు పట్టుదలతో చదవాలి.

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి(నైధనతార)మానసిక ఆందోళన.పనులలో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి.సమాజంలో అపవాదము రాగలవు.

పూ.భాద్ర నక్షత్రం వారికి(సాధన తార)మానసిక ఆనందం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-వ్యాపారంలో పెట్టుబడి తగ్గ ధన లాభం కలుగుతుంది.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఆర్థికంగా బాగుంటుంది.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాగలవు.బంధుమిత్రుల కలయిక ఆనందం కలగజేస్తుంది.విద్యార్థులు చదువు యందు ప్రతిభ కనబరుస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి(ప్రత్యక్తార) ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా మెలగాలి.బంధుమిత్రులతో అకారణ కలహాలు రాగలవు.వస్తువులు జాగ్రత్త.

రేవతి నక్షత్రం వారికి(క్షేమతార) వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అధికారులు ఆదరణ పొందగలరు. ధనలాభం.

దిన ఫలం:-ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహారాలు చెక్క పెట్టుకోవాలి.పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో  అనుకూలమైన మద్దతు లభిస్తుంది.సమస్యలు సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అందుకోలేరు.ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
 

click me!