Today Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు

First Published Mar 10, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 


10-3-2024,ఆదివారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

భరణి నక్షత్రం వారికి(సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-ఆర్థిక లాభాలు పొందగలరు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.ఇతరులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఉపాధి మార్గాలు లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగును, ఉద్యోగాలు అనుకూలంగా ఉండును.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.గౌరవంగా గడుపుతారు.

మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలు జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  కీలకమైన విషయం గురించి చర్చలు చేస్తారు.ఉత్సాహంగా ఉంటారు. మనోవాంఛలు నెరవేరును. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందగలరు. ఎంతటి కార్యాన్నైనా సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు.

పునర్వసు నక్షత్రం వారికి(జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించును.వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలు లో నూతనోత్సాహంతో పని చేస్తారు ఓం రామాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి..
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి  ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు.అకారణ కలహాలు.శారీరక బాధలు.వ్యాపారంలో ధన నష్టము రావచ్చు.

ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం.

దిన ఫలం:-ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆకస్మిక ధనలాభం.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదర అభిమానం పొందగలరు.వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల గౌరవం పొందుతారు. నూతన విధానాన్ని ఆచరణలో పెడతారు.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి(నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-గృహ సంబంధిత అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు.శుభకార్యాలు గూర్చి ఆలోచన చేస్తారు.ప్రయాణంలో విలువైన వస్తువులు తో జాగ్రత్తలు తీసుకోవాలి.ఉద్యోగాలు లో అధికారులు తో సఖ్యత గా ఉండాలి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.పాత మిత్రుల తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (క్షేమతార) శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.

చిత్త నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు చేజారే అవకాశం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవ్వచ్చు.ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు.

విశాఖ  నక్షత్రం వారికి (జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగం అనుకూలం.శుభవార్తలు వింటారు.పరిస్థితులు అనుకూలంగా ఉండును. సమస్యలు ను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ వారికి (పరమమిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము.

జ్యేష్ఠ నక్షత్రం వారికి  (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం.

దిన ఫలం:-ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు.ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు.కుటుంబ సభ్యులతో చికాకులు. అనారోగ్య సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.వ్యవహారాలు లో స్తబ్దత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో  మాటపట్టింపులు రాగలవు. ఉద్యోగాలు లో  అధికారులు తో కలహాలు.ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు.

పూ.షాఢ నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఉ.షాఢ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:-ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.అధికారులు తో  సమస్యలు రాగలవు. ఇతరులతో మాట్లాడేటప్పుడు  జాగ్రత్తగా మాట్లాడాలి.అనుకొని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు ఎదురవుతాయి.అధిక ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి .ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.

ధనిష్ఠ నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు.

దిన ఫలం:-బంధువర్గంతో విభేదాలు రాగలవు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ఇంటా బయటా ప్రతికూలత వాతావరణం.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు.ఓం వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) 
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు

పూ.భా నక్షత్రం వారికి (జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం..

దిన ఫలం:-ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు సహాయం తీసుకోవాలి.ఇంటికి సంబంధించిన  వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఓం లక్ష్మీ నరసింహ స్వామినే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము.

రేవతి నక్షత్రం  వారికి  (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం.

దిన ఫలం:-వాయిదా పడిన పనులు పూర్తి అగును.నూతన ఆలోచనలు చేస్తారు.బంధుమిత్రుల సహకారం అందుతుంది. ప్రభుత్వ సంబంధిత కార్యములు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.ఓం ఈశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

click me!