ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి వృత్తి వ్యాపారంలో ధన నష్టం

First Published Nov 8, 2022, 4:50 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు.  వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చును. 

Horoscope

పంచాంగం :  
 తేది : 8నవంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీక మాసం
ఋతువు : శరదృతువు
పక్షం : శుక్లపక్షము                                                                                          
వారము: మంగళవారం
తిథి :   పౌర్ణమి మ 3.41 వరకు
నక్షత్రం :.   భరణి   రా 1.40 ని వరకు
వర్జ్యం:     ఉ 10.51 ల 12.30   వరకు
దుర్ముహూర్తం:ఉ.08.20ని. నుండి ఉ. 9.06ని. వరకు తిరిగి రా.10.28ని. నుండి రా.11.19ని. వరకు
రాహుకాలం:మ. 3.00ని.నుండి సా.4.30ని. వరకు
యమగండం:ఉ. 9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 06:04ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:24 ని.లకు
పాక్షిక రహగ్రస్త చంద్ర గ్రహణం
స్వర్శ కాలం మ 02.39 ని.లకు
మోక్ష కాలం సా.06.19 ని.లకు

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటారు. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడం  కొత్త సమస్యలు ఏర్పడగలవు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసి వస్తుంది.   వివాదాలకు దూరంగా ఉండండి. కోపంతో  కాకుండా ప్రశాంతంగా మీ యొక్క సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.  బంధుమిత్రుల యొక్క కలయిక. ఉద్యోగం నందు కొద్దిపాటి ఒడిదుడుకులు ఇబ్బంది కలగచేస్తాయి. కొన్ని కీలక మైన సమస్యలను జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
భావోద్వేగాలు తో చేసే పనులు కొత్త సమస్యలు ఏర్పడను. ఉద్యోగులు  ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు.  వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చును. కొన్ని కీలకమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త వహించవలెను. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్త తీసుకొని వలెను .

Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది.పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి.సంఘము నందు వాదోపవాదాలుకుదూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట ఉంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తప్పవు.చెడు స్నేహితులను  దూరంగా ఉండాలి . చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటుంటారు . పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు . మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ.సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం . పెద్దలు పట్ల గౌరవం గా . సమయానుకూలంగా  తెలివిగా ముందుకు . ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం .

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బందు లెదుర్కుంటారు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కొత్తవారితో స్నేహం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు గా ఉండును. సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడును. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మనస్సు నందు ఆందోళన. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈరోజు ఆనందంగా గడుపుతారు. సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు.  రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసివస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును. ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం.

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

శుభవార్తలు వింటారు.గృహము నందు ఆనందకరమైన వాతావరణం. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును. సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును. వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును. ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది. పెద్దల యొక్క స్నేహాలు లాభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
శుభవార్తలు వింటారు.గృహము నందు ఆనందకరమైన వాతావరణం.  స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును. సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును. వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును. ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది. పెద్దల యొక్క స్నేహాలు లాభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి
 

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణ . పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం భవిష్యత్తు బాగుంటుంది.అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును . మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి . కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి
 

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది. పోస్టల్, ఏసీ ఏజెంట్లకు కలసిరాగలదు. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సంఘము నందు  అవమానాలు. చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన కొద్దిపాటి సమస్యఏర్పడును.క్రయ విక్రయాలకు అనుకూలం.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, ముఠా కార్మికులకు కలిసిరాగలదు.ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .    

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

శుభవార్తలు వింటారు . నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు . మీకందిన చెక్కులు చెల్లక ఇబ్బందు లెదుర్కుంటారు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అగును . ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును . సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును . వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది . అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి . పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును . ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది .  ప్రయాణాలు . ఉద్యోగము నందు పై అధికారుల మన్నన పొందుతారు
 

click me!