ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు ఎలాంటి ఆర్థిక పరమైన రిస్క్ తీసుకోవద్దు

First Published Feb 8, 2023, 5:09 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది.

daily horoscope

  
పంచాంగం:                                                                                      
తేది :  8 ఫ్రిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . మాఘం
ఋతువు : శిశిరం
పక్షం :       కృష్ణపక్షము                                                                                  
వారము: ఋధ వారం
తిథి :   తదియ తెల్లవారుజామున 4:27 నివరకు
నక్షత్రం :.   పూర్వ ఫల్గుణి సాయంత్రం 6:57ని వరకు
వర్జ్యం:   రాత్రి 02: 39 నినుండి 4 :21   ని వరకు
దుర్ముహూర్తం:మ.11.51ని. నుండి మ.12.37ని. వరకు.            
రాహుకాలం:మ.12.00ని.నుండి మ.01.30ని.వరకు
యమగండం:ఉ.07.30ని. నుండి ఉ.09.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.35ని.లకు
సూర్యాస్తమయం: సా.05.54 ని.లకు

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శారీరక శ్రమ అధికమై శరీర బాధలు పెరుగును. కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధపడతారు. చేయ పనులలో తొందరపాటు నిర్ణయాల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రుల తోటి కలహాల రావచ్చు. వస్తువులు యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
పట్టుదలతోచేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతో టీ సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును.
ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చేయ పనులు పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడతాయి. సమాజము నందు మీరు చేయని పనులకు బాధ్యతలు మీ  మీద   పడి అవమానాలకు కి గురవుతారు. వాదనలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు మనసు నందు చికాకులు పుట్టించును. దురాచనులకు దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేయ ఖర్చులు యందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈరోజు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
చేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతో టీ సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును.
ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘము నందు మీ  ప్రతిభకు తగ్గ గౌరవం పెరుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.  కీలకమైన సమస్యలను బుద్ధి కుశలత తో పరిష్కారం చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దామోదరాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చేయ పనులను పనులు యందు కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను. అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. రాజకీయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆదిత్యాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
తలపెట్టిన పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యిందు ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు . కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేయ పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి.సంతానం మూలకంగా శుభవార్తలు వింటారు., నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు గురవే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. సమాజము నందు మీ మాట విలువ తగ్గును. ఉద్యోగమునందు అధికారులతోటి పేచీలు ఏర్పడవచ్చు. మిత్రులు నమక ద్రోహం చేయాలని చూస్తారు. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీన పడుతుంది. కీలకమైన సమస్యలు పెరిగి మానసిక బాధలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. అనాలోచిత పనుల వలన ఇబ్బందులకు గురవుతారు. పని వారి తోటి ఇబ్బందులు రావచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తాయి. వృత్తి వ్యాపారము నందు రాబడి పెరుగును. గృహమునకు కావలసిన వస్తువుల గూర్చి అధికంగా ఖర్చు చేస్తారు. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమునందు పై అధికారుల ఆదర అభిమానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకునట్లుగా పూర్తగును. రావలసిన పాత బాకీలు వసూలు అవును. శారీరిక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వృత్తి వ్యాపారాల యందు ఉహించని ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి  బంధుమిత్రుల తోటి చర్చిస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. ఉద్యోగం నందు పై అధికారుల ఆశీస్సులు లభించును. సమాజమునందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
సమాజం నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగును. ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. ఇతరులతోటి చేయు వ్యవహారము నందు మృదువుగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్క పెట్టవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

click me!