ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..!

ramya Sridhar | Updated : Nov 29 2022, 04:59 AM IST
Google News Follow Us

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

114
  ఈ రోజు రాశిఫలాలు: ఓ  రాశి వారు  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..!

పంచాంగం      
  తేది : 29నవంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిర
ఋతువు : హేమంత
పక్షం.        శుక్లపక్షము                                                                                        
వారము: మంగళవారం
తిథి :   షష్టి మధ్యాహ్నం 3.51 నివరకు
నక్షత్రం :.      శ్రవణం మధ్యాహ్న 1.45 ని వరకు
వర్జ్యం:     సాయత్రం 5.30 ల 7.00 ని వరకు
దుర్ముహూర్తం:ఉ.08.28ని. నుండి ఉ.09.13ని. వరకు తిరిగి రా.10.30ని. నుండి రా.11. 22ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.09.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉ.06.16ని.లకు
సూర్యాస్తమయం: సా.05.20ని.లకు
శ్రీసుబ్రహ్మణ్య షష్టి

214
Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

314
Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటితనంగా వ్యవహరించడం మేలు. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.

Related Articles

414
Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు. శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

514
Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి.. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.  బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు.  బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.  సూర్య ఆరాధన శుభప్రదం.

614
Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కీలక సమయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయమార్గానికి బాటలు వేస్తారు.పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు.బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

714
Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.  సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

814
Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఆర్ధిక విషయంలో మేలైన ఫలితాలను పొందుతారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  సూర్య ఆరాధన శుభప్రదం.

914
Zodiac Sign


 తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఆర్ధిక విషయంలో మేలైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

1014
Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది.ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.  బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. స్వల్ప ధన లాభం. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.
 

1114
Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమస్యలను బుద్ధి బలంతోటి పరిష్కరిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి.   రవి ధ్యానం మేలు చేస్తుంది.

1214
Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు.  కీలకమైన కొనుగోలు వ్యవహారంలో లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి  పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను. కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. శివపార్వతులను పూజించడం మంచిది.

1314
Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాల్లో పెద్దల సూచనలు మేలుచేస్తాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

1414
Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి.  మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటితనంగా వ్యవహరించడం మేలు. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి.  లక్ష్మీ ఆరాధన శుభప్రదం.

Read more Photos on
Recommended Photos