రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి శ్రమాధిక్యత ..!

First Published Dec 29, 2022, 4:45 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు   ఇంట బయట మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది . తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి . ఉద్యోగమునందు అధికారాల యొక్క స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి.

పంచాంగం:                                                                                                                                                                                                 
 సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యం
ఋతువు : హేమంత ఋతువు
పక్షం :శుక్లపక్షం                                                                                       
వారము: గురువారం
తిథి :   సప్తమి రాత్రి 01.21 నివరకు
నక్షత్రం :పూ .భా   సాయంత్రం05.58 నివరకు 
వర్జ్యం:తెల్లవారుజామున03.13 ని04.45 ని  వరకు
దుర్ముహూర్తం:ఉ.10.13ని నుండి ఉ.10.56ని వరుకు తిరిగి మ.2.35 నుండి మ.03.19వరకు.
రాహుకాలం:మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం:ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు
సూర్యోదయం : ఉ.06.34ని.లకు
సూర్యాస్తమయం: సా.05.31ని.లకు

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఇతరుల యొక్క విషయాల యందు దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను. చేయ పనులయందు ఆసక్తి లేకుండా ఉండుట . చేయ పనివారితో టి ఇబ్బందులు ఏర్పడతాయి . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజములో  అవమానములు కలిగి గౌరవం తగ్గుతుంది . మనస్సు ఆందోళనగా ఉంటుంది . ఆరోగ్యం సమస్యలు ఇబ్బంది పెడతాయి . స్నేహితులతోటి మాట పట్టింపులు వస్తాయి . ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని వలెను . వృత్తి వ్యాపారముల యందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది .ఈ రాశి వారు ఈరోజు ఓం రుద్రాయ నమః అని 11 సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల యందు ఊహంచన ధన లాభం కలుగుతుంది . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంట బయట మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది . తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి . ఉద్యోగమునందు అధికారాల యొక్క స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు ఓం వాచస్పతయే నమః అనే 11 సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయాల తోటి ఇతరులతో ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో టి వ్యవహారం చేయాలి . పై అధికారుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగమునందు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని 11 సార్లు జపించండి .శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి.

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
మంచి విషయాలు తెలుస్తాయి.  ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు . జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు . మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది . నూతన పరిచయాలు కలిసి వస్తాయి . సోదరి సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటుంది .  వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ధన లాభం కలుగుతుంది.కీలకమైన సమస్యల నుండి విముక్తి పొందవచ్చును .అభివృద్ధి పనులు ఆలోచనలు ఆచరణలో పెడతారు . పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు .ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని 11సార్లు  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం . తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములు యందు సామాన్యమైన లాభం కలుగును . అనవసరమైన ఆలోచనయందు దూరంగా ఉండండి . ఆరోగ్యము విషయం లో ఇబ్బందులు ఏర్పడవచ్చు . అనవసరమైన ప్రయాణాలు చికాకుగా ఉంటుంది.  మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఆవేశంతో వాదనలు వలన సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును . ఓం హిమగర్భాయనమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శారీరకంగా బలహీనంగా ఉంటుంది . ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావారణం . ఉద్యోగమునందు పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి వ్యాపారాల యందు మీ అంచనాలు తారుమారవుతాయి. నిత్యంమీతో పాటు ఉండే వారి తోటి విరోధాలకు దూరంగా ఉండడం మంచిది . అనవసరమైన ఖర్చులు పెరగకుండా  జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని 11సార్లు  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నూతన వస్తు వాహనాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి . శుభకార్యాలలో పాల్గొంటారు . విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు . స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు . వృత్తి వ్యాపారం వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది . సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది . తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి .ఈ రాశి వారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అనే పదకొండుసార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సంఘము నందు  అవమానాలు. చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన కొద్దిపాటి సమస్యఏర్పడును  .ఓం ఛాయ పుత్రాయ నమః అని 11సార్లు జపించండి .శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .    ఓం బృహస్పతయే నమః అని 11సార్లు జపించండి .శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి . ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి . వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడడం వలన కొత్తసమస్యలు ఏర్పడతాయి .మనసునందు అనేకమైన ఆలోచనతోటి ఆందోళనగా ఉంటుంది . బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఇతరులతోటి వాదన వేయడం మంచిది కాదు. రావలసిన బాకీలు తిరిగి లభించగలవు. శ్రీ రాహు మూర్తయే నమః అని 11సార్లు జపించండి .శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈరోజు ఆనందంగా గడుపుతారు. సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును. ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఓం భార్గవాయ నమః అనే 11 సార్లు జపించండి. శుభ ఫలితాలు పొందండి

click me!