ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారు ఆకస్మిక ధనలాభయోగం

First Published Dec 26, 2022, 4:19 AM IST

ఈ రోజు  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వృత్తి వ్యాపారాల యందు మీ అంచనాలు తారుమారవుతాయి. నిత్యంమీతో పాటు ఉండే వారి తోటి విరోధాలకు దూరంగా ఉండడం మంచిది . అనవసరమైన ఖర్చులు పెరగకుండా  జాగ్రత్త వహించాలి . 

పంచాంగం: 
 
తేది 26డిసెంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం :పుష్యం
ఋతువు : హెమంత
పక్షం : శుక్ల పక్షం                                                                                      
వారము: సోమవారం
తిథి :   తదియ ఉదయం 9:31 నివరకు
నక్షత్రం :. శ్రవణం రాత్రి 10.04 ని  వరకు
వర్జ్యం:   రాత్రి 01.48 ని ల03.18 వరకు
దుర్ముహూర్తం:మ.12.21ని. నుండి మ.01.05ని. వరకు తిరిగి మ.02.33ని. నుండి మ.03.16ని. వరకు
రాహుకాలం:మ.01.30ని నుండి మ.03.00ని వరకు
యమగండం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.31ని.లకు
సూర్యాస్తమయం: సా.05.28ని.లకు

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల యందు ఊహంచన ధన లాభం కలుగుతుంది . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంట బయట మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది . తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి . ఉద్యోగమునందు అధికారాల యొక్క స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. ఓం వాచస్పతయే నమః అనే 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
శారీరకంగా బలహీనంగా ఉంటుంది . ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావారణం . ఉద్యోగమునందు పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి వ్యాపారాల యందు మీ అంచనాలు తారుమారవుతాయి. నిత్యంమీతో పాటు ఉండే వారి తోటి విరోధాలకు దూరంగా ఉండడం మంచిది . అనవసరమైన ఖర్చులు పెరగకుండా  జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని 11సార్లు  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

నూతన వస్తు వాహనాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి . శుభకార్యాలలో పాల్గొంటారు . విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు . స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు . వృత్తి వ్యాపారం వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది . సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది . తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి .ఈ రాశి వారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అనే పదకొండోసార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
మంచి విషయాలు తెలుస్తాయి.  ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు . జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు . మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది . నూతన పరిచయాలు కలిసి వస్తాయి . సోదరి సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటుంది .  వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ధన లాభం కలుగుతుంది.కీలకమైన సమస్యల నుండి విముక్తి పొందవచ్చును .అభివృద్ధి పనులు ఆలోచనలు ఆచరణలో పెడతారు . పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు .ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని 11సార్లు  జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి . ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి . వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడడం వలన కొత్తసమస్యలు ఏర్పడతాయి .మనసునందు అనేకమైన ఆలోచనతోటి ఆందోళనగా ఉంటుంది . బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఇతరులతోటి వాదన వేయడం మంచిది కాదు. రావలసిన బాకీలు తిరిగి లభించగలవు. శ్రీ రాహు మూర్తయే నమః అనే 11  సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయాల తోటి ఇతరులతో ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో టి వ్యవహారం చేయాలి . పై అధికారుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగమునందు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఇతరుల యొక్క విషయాల యందు దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను. చేయ పనులయందు ఆసక్తి లేకుండా ఉండుట . చేయ పనివారితో టి ఇబ్బందులు ఏర్పడతాయి . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజములో  అవమానములు కలిగి గౌరవం తగ్గుతుంది . మనస్సు ఆందోళనగా ఉంటుంది . ఆరోగ్యం సమస్యలు ఇబ్బంది పెడతాయి . స్నేహితులతోటి మాట పట్టింపులు వస్తాయి . ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని వలెను . వృత్తి వ్యాపారముల యందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది .ఈ రాశి వారు ఈరోజు ఓం రుద్రాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం . తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములు యందు సామాన్యమైన లాభం కలుగును . అనవసరమైన ఆలోచనయందు దూరంగా ఉండండి . ఆరోగ్యము విషయం లో ఇబ్బందులు ఏర్పడవచ్చు . అనవసరమైన ప్రయాణాలు చికాకుగా ఉంటుంది.  మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఆవేశంతో వాదనలు వలన సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును . ఓం హిమగర్భాయనమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .   .ఈ రాశి వారు ఈరోజు  ఓం బృహస్పతయే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అధికారులతో కొద్దిపాటి విరోధాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణ . అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును . మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి . కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి ఈరోజు సూర్యాయ నమః అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి.

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): 

ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది.పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి.సంఘము నందు వాదోపవాదాలుకుదూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను  అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి ఓంవీరభద్రాయనమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి
 

click me!