ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు

First Published Apr 25, 2023, 5:25 AM IST

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగమునందు అధికార తోటి కలహాలు ఏర్పడవచ్చును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:        
                                                                                                                                                                    
తేది :  25  ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . వైశాఖం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం :-శుక్ల పక్షము                                                                                  
వారము:- మంగళవారం
తిథి :- పంచమి ఉదయం 9.43 ని.వరకు
నక్షత్రం :-    ఆరుద్ర తె.4.23 ని.వరకు
యోగం:- అతిగండము ఉ॥8.07 ని.వరకు
కరణం:- బాలవ ఉ॥9.43 కౌలవ రాత్రి 10.26 ని.వరకు
అమృత ఘడియలు:- సాయంత్రం 5.35 ని.ల 7.18 ని.వరకు
వర్జ్యం:- ఉదయం 11.33 ని.ల 1.16 ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.08.12ని. నుండి ఉ.09.02ని. వరకు తిరిగి రా.10.48 ని. నుండి రా.11.34ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
గురు మౌఢ్యం త్యాగం

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలయంతో ఊహించిన ధన లాభములు కలుగును. మనసునందు ఆందోళన తీరి ప్రశాంతత లభించును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారా లభిస్తాయి. శుభవార్త వింటారు. సంఘమునందు మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించును. విందూ వినోదాల్లో  పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియైనమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చెడువార్తల వలన మనసు నందు బాధ  కలుగుతుంది. తొందరపాటు పనుల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. చేయ పని వారి తోటి సఖ్యతగా ఉండవలెను.  వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగమునందు అధికార తోటి కలహాలు ఏర్పడవచ్చును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఉద్యోగమునందు అధికారుల తోటి కలహాలు. అకారణ కోపానికి పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు.   వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్తుంది.  సమస్యలు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును. పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు మిత్రాయ నమః అని   జపించండి  శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ పూర్తవును. ఉద్యోగమునందు సహోదయోగల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.పాత బాకీలు వసూలగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వరలక్ష్మియై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చేయు పనుల యందు ఆటంకాలు ఏర్పడను ప్రయాణాల్లో వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం సంతాన విషయంలో సఖ్యత సఖ్యతగా వెలుగులను ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడను కలహాలకు దూరంగా ఉండండి మనసు నందు భయం భయంగా ఉంటుంది ఏ శారీరక శ్రమ అధికంగా ఉండును ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఏర్పడను ఆ కారణమైన ఆవేశం తగ్గించుకుని నిర్ణయాలు తీసుకొనవలెను సమాజం నందు నిందారోపణలు ఏర్పడగలవు ఈరోజు ఈ రాశి వారు  ఓం శివాయ నమః అని  జపించండిశుభఫలితాలు పొందండి

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
మానసికంగా  ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా జరుగుతాయి.  కుటుంబ సభ్యులతో టి కలిసి ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబడుస్తారు. సమాజం నందు పెద్దవారి యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగం  నందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని జపించండి  శుభ ఫలితాలు పొందండి

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శుభవార్తలు వింటారు ప్రారంభించిన పనులన్నీ పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. సమాజము నందు మీ బ్రతుకు తగ్గ గౌరవం లభించును. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. హిందూ వినోదాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులు కలయిక. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలను వసూలు అగును. సోదరి సహోదర వలన మనస్పర్ధలు రావచ్చు. సహచరుల వలన అపకారాలు జరగవచ్చును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమః అని  జపించండి  శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చేయ పనులు పూర్తవుతాయి.  చేయు వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చును. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓంసుబ్రహ్మణ్యాయ నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
సమాజము నందు అపవాదములు.  తొందరపాటు మాటల వలన కలహాలు ఏర్పడుతాయి. చేయ పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మనస్సునందు అనేక సమస్యలు చికాకులు ఏర్పడవచ్చు. హీనమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ప్రయాణాలయందు మరియు పని యందుజాగ్రత్త వహించవలెను. ఈరోజు ఈ రాశివారు ఓం శంభవే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. మనసునందు అనేక ఆలోచనలతోటి మహాభయంగా ఉండును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులతోటి మృదువగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

ప్రయత్నించిన పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి ‌. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు అనుకూలత వాతావరణం. ఇతరులకు మీ వంతు  సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో టి సంభాషణ చేసేటప్పుడు మాటలు తూల కొండ చూసుకోవాలి . మంచి విషయాలు వింటారు. సంఘము నందు తగిన గౌరవం లభించును. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః శుభ ఫలితాలు పొందండి అని జపించండి. 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఆదర అభిమానములు పొందగలరు. వ్యక్తిగత ప్రతిష్టలు పెరుగుతుంది. శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యాలాభం. భవిష్యత్తు గురించి చేయు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈ రాశి వారు ఓం కృష్ణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

click me!