ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారి ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి

First Published Nov 24, 2022, 4:28 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు

పంచాంగం      
 సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిర
ఋతువు : హేమంత
పక్షం : శుక్లపక్షము                                                                                         
వారము: గురువారం
తిథి :   పాడ్యమి రా 2.58 వరకు
నక్షత్రం :.      అనూరాధ రాత్రి 9.18 వరకు
వర్జ్యం:      రాత్రి  2.37ల 4.07వరకు
దుర్ముహూర్తం:ఉ.09. 55ని నుండి ఉ.10.39ని వరుకు తిరిగి మ.0 2.22నుండి మ.03.06 వరకు.
రాహుకాలం:మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం:ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు
సూర్యోదయం : ఉ.06.13ని.లకు
సూర్యాస్తమయం: సా.05.20ని.లకు

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.  బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. కీలకమైన సమస్యలను బుద్ధి బలంతోటి పరిష్కరిస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి.  దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం శుభకరం.

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరం అవుతాయి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.  సూర్య ఆరాధన శుభప్రదం.
 

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఆర్ధిక విషయంలో మేలైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త.  వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి  పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను.  కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను.   రవి ధ్యానం మేలు చేస్తుంది.

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం.
 సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఆర్ధిక విషయంలో మేలైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.   లలితా సహస్రనామ పారాయణ చేయాలి.  

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం.శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.  
 

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని సంఘటనలు మన బలాన్నిపెంచుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. స్వల్ప ధన లాభం. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.   ఇష్టదేవతా శ్లోకం చదవాలి.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి.నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు. శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం శుభకరం.

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు. సూర్య నమస్కారం వల్ల శుభఫలితాలు ఉంటాయి.

click me!