Daily Horoscope 2022 New 09
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Daily Horoscope 2022 New 10
పంచాంగం :
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్షఋతువు
వారము: బుధవారం
పక్షం : కృష్ణపక్షము
తిథి : బ.ద్వాదశి ఉ.07.54ని. వరకు
నక్షత్రం : పునర్వసు మ.02.15ని. వరకు
వర్జ్యం : రా.11.04 ని. నుండి రా.12.49 ని. వరకు
దుర్ముహూర్తం : మ. 11.37ని. నుండి మ. 12.27ని. వరకు.
రాహుకాలం: మ. 12.00ని.నుండి మ. 1.30ని.వరకు
యమగండం: ఉ. 07.30ని. నుండి ఉ. 9.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:47ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:18ని.ల వరకు.
మాసశివరాత్రి
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమ పడ్డ ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.
వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . కోపతాపాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి.
ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ వాహన యోగాలు.
పనులలో విజయం సాధిస్తారు. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.
వాహన సౌఖ్యం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి అనుకొని ఆహ్వానాలు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది.
శ్రమాధిక్యత. కుటుంబంలో ఏర్పడినచికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. వృత్తి,వ్యాపారాల స్వల్ప లాభాలు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. బంధువులను కలుసుకుంటారు.
నూతన వ్యాపారాలలో లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం.గృహంలో అనుకూలమైన వాతావరణం.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు ఏర్పడినప్పటికీ పూర్తి చేస్తారు.
ఆరోగ్య సమస్యలు ఏర్పడి చికాకు తెప్పిస్తాయి. ప్రయాణాలలో నిర్లక్ష్యం తగదు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. రాబడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు. కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగి ఉపశమనం పొందుతారు. పనులు సాఫీగా సాగుతాయి వృత్తి వ్యాపారాలో లాభాలు.
సంతానమునకు విద్యా ఉద్యోగ అవకాశాలు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.
ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.
కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.
వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
గృహ నిర్మాణ ఆలోచనలో ఆచితూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
బంధుమిత్రుల నుండి అనుకోని ఆహ్వానాలు.పెట్టుబడులలో తగిన లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.
విద్యార్థులకు అనుకూలం.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాల కొనుగోలు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.
రుణ బాధల నుండి కొంతవరకు బయటపడతారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.