ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

First Published | Oct 16, 2022, 4:59 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పై అధికారుల వలన చికాకులు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం : 
   
తేది : 16అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                          
వారము: ఆదివారం
తిథి : సప్తమి పూర్తి
నక్షత్రం : ఆరుద్ర రా.01.48ని.వరకు
వర్జ్యం: ఉ.08.37ని.ల నుండి ఉ.10.23 ని.ల వరకు
దుర్ముహూర్తం:సా.04.02ని. నుండి సా.04.49ని. వరకు                             
  రాహుకాలం:మ 4.30ని నుండి 6.00ని వరకు.                                                                 
 యమగండం:మ.12.00ని. నుండి మ.1.30ని. వరకు.                                                                             
సూర్యోదయం : ఉదయం 05:56ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:36ని.లకు
 


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇంటా, బయటా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.  స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
తలపెట్టిన పనులలో ఆటంకాలు.  కుటుంబసభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పై అధికారుల వలన చికాకులు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనవసరమైన కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.
 

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దైవ,పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది.  పుణ్య‌‌క్షేత్రాలు సందర్శిస్తారు.వాహన సౌఖ్యము.దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఉద్యోగాలలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు దొర్లే ఆస్కారముంది. మీ సంతానానికి కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు.  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.విలువైన వస్తు ఆభరణాలు కొనుగొలు చేస్తారు. సన్నిహితులతో కలిసి అందంగా గడుపుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన.


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. - రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచన లుంటాయి.  శ్రమ అధికం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్యక ఇబ్బందుల వలన కొంతమేర రుణాలు చేయవలసొస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలు.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శుభవార్తలు వింటారు. తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. మతిమరుపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు షాపింగ్ లోను, కొత్త వ్యక్తులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి.


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు.  కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు.  తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన పనులలో శ్రమ పెరుగుతుంది.మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటనఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.  తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు.ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనవసరమైన కలహాలు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.  సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు.  అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.  వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కొంతమేర రుణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. వ్యాపారాలలో లాభాలు.

Latest Videos

click me!