Daily Horoscope
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం
తేది : 11ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం . చైత్రం
ఋతువు : వసంత ఋతువు
పక్షం :-కృష్ణపక్షము
వారము:- మంగళవారం
తిథి :- పంచమి ఉదయం 6.42 ని.వరకు షష్టి తెల్లవారుజామున 4.46 ని.వరకు
నక్షత్రం :- జ్యేష్ఠ మధ్యాహ్నం 12.26ని.వరకు
యోగం:- వరీయాన్ సా॥5.26 ని.వరకు
కరణం:- తైతుల ఉ॥6.42 గరజి సా॥5.44 వణిజి తె.5.19 ని.వరకు
అమృత ఘడియలు:-తె.5.10 నుండి
వర్జ్యం:-. రాత్రి 8.03 ని.ల 9.34ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.08.18ని. నుండి ఉ.09.07ని. వరకు తిరిగి రా.10.49 ని. నుండి రా.11.36ని. వరకు
రాహుకాలం:మ.03.00ని. నుండి సా.04.30ని. వరకు
యమగండం:ఉ.12.ని. నుండి ఉ.01.30ని. వరకు
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా నుండును. వృత్తి వ్యాపారాల యందు కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతాయి. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలపెట్టిన పనులలో బుద్ధి కుశలత లేకపోవడం వలన ఆటంకాలు ఏర్పడను. పెద్దవారు స్నేహ సంబంధాలు బలపడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుట వ్యక్తులను చులకనగా చూడటం వల్ల మీకు అపకారం చేయాలని చూస్తారు. కుటుంబవనందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు ఓం రవయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కేసులు వివాదములు పరిష్కారం ముఖ్యమైన పనులలో బంధువుల సలహాలు సూచనలు తీసుకొనవలెను. పనాలలో అడ్డంకలు ఏర్పడిన క్రమేణా పూర్తి చేస్తారు. ఉద్యోగం నందు అధికారుల సహాయ సహకారాలు ఆరు సమకూరి ప్రశాంతత లభించును. వివాహ జీవితం ఆనందంగా గడుపుతారు. భూ గృహ నిర్మాణాలు అనుకూలించును. వృత్తి వ్యాపారం నందు అనుకోని ధన లాభం కలుగును. సంఘములో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు ఈరాశి వారు ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను. మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును. పట్టుదలతో చేయు పనులు పనులలో విజయం సాధిస్తారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని కొన్ని సంఘటనలు కలవరం పెడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
అనాలోచిత పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు వలనమానసిక బాధ ఏర్పడును. బందు వర్గం తోటి మనస్పర్ధలు రావచ్చును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి.ఉద్యోగులకు అధికార ఒత్తులు పెరుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయైనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగం నందు అధికారులతోటి విభేదాలు ఏర్పడను. అకారణ కోపానికి మరియు తొందరపాటు పనుల్లో ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. భూ గృహ క్రయవిక్రయాలు యందు ధనలాభం కలుగుతుంది . అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం వాటిల్లను. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. మిత్రుల వలన అపకారం జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
గృహము నందు శుభకార్యా చరణ. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగమునందు అనుకోని మార్పులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మీకంటే పెద్దవారి స్నేహములు కలిసి వచ్చును. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి . సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం నవదుర్గయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
మనసునందుకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మిత్రులతోటి అభివృద్ధి కార్యక్రమాల గూర్చి చర్చిస్తారు. ఇతరులకు నీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలు అగును. ఉద్యోగం నందు పని ఒత్తిడి తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చేయ పనులలో సమయస్ఫూర్తి తోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. సమాజము నందు పెద్దవారి యొక్క ఆధర అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో నూతన ఉత్సాహంతో టి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు కలసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజం నందు ప్రతిభ తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రజాభిమానం పొందగలరు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
తన తలపెట్టిన పనాలలో ఆటంకాలు ఏర్పడతాయి. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. చేయు పని వారి తోటి అకారణ కలహాలు ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్లుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. బందు వర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కుటుంబమునందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. దురాలోచనలు వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.ఊహించని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి . ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించి జపించండి ఫలితాలు పొందండి.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వృత్తి వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన అధిక ఖర్చుల వలన బాధ కలుగును. సంఘమునందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. బంధువర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. కొత్త సమస్యలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు తీసుకొవాలి. ఉద్యోగమునందు పని ఒత్తిడి పెరుగును. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. బంధువుల యొక్క కలయిక. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి