Horoscope Today : ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం..!

First Published May 16, 2022, 6:30 AM IST

మే 16  సోమవారం 2022  మీ  రాశి ఫలాలు.. రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-  
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు ఎక్కవ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అనిపిస్తాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  
అనవసర ఖర్చులు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలు గృహోపకరణాలకు విలువైన వస్తువులను కొనుగోలుకై చేయుయత్నాలు వాయిదా పడతాయి. చేతి వృత్తి, వ్యాపారులకు సదావకాశాలు లభిస్తాయి. పనుల యందు నిరాసక్తత. అకారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  
అవసరమైన గొడవలు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి అనుకున్నంత గుర్తింపు లభించదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించినా ఏదో ఒక లోటు కనపడుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 
చేయు పనులయందు ఆలస్యం. కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి.  భార్య,భర్తల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.  అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
శుభవార్తలు వింటారు.  అయితే అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.చేతి వృత్తి, వ్యాపారులకు సదావకాశాలు లభిస్తాయి. వస్త్ర, ఆకస్మిక ధనలాభం వంటి శుభపరిణామాలున్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 
అన్ని పనులకు అనుకూలం. చిత్తశుద్ధితో మెలిగి మీ నిజాయితీని చాటుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. పెంపుడు జంతువుల పట్ల మెళకువ వహించండి. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 
ఈ రోజు మీకు అదృష్టమైన రోజు.  ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతారు.  మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.  శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 
కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది.  అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవ్వడం వల్ల ఆందోళన చెందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి అనుకున్నంత గుర్తింపు లభించదు. క్రయ విక్రయాలు యందు తెలివిగా వ్యవహరించాలి. అనవసరమైన గొడవలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. కష్టించి చేసిన పనులలో లాభం చేకూరును. హనుమంతుని ప్రార్ధించిన శుభం జరుగును.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 
అన్ని పనులకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో లాభం. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కార్యాలకు శ్రీకారం చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తగును. ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. స్థిరచరాస్తుల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు మెలకువ అవసరం. ఖర్చులు సామాన్యంగా ఉండగలవు. దుర్గా దేవిని ఆరాధించి న శుభం జరుగును.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
శుభవార్తలు వింటారు. చేతివృత్తుల వారికి అనుకూలం. బ్యాంకు వ్యవహారాలలో మెలుకవ అత్యవసరం. ఆలయాలను సందర్శిస్తారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఓర్పు, లౌక్యం చాలా ముఖ్యం. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ధన లాభం. రావలసిన బకాయిలు వసూలు అవును. సూర్యారాధన చేసిన శుభం జరుగును.

మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. వ్యవసాయ, తోటల రంగాల వారికి కొద్దిగా ఆందోళన. పెద్దల, దైవ కార్యాలలో పాల్గొంటారు. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది

Daily Horoscope 2022 - 13

పంచాగం

16 మే 2022 సోమవారం

శుభ కృత నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
శుక్లపక్షం
పూర్ణిమ పగలు10:07ని‌.ల వరకు తదుపరి బి.పాడ్యమి
విశాఖ నక్షత్రం మధ్యాహ్నం.02:05ని|| వరకు
వర్జ్యం సా.05:52ని.ల లగాయతు సా.07:22ని.లవరకు
దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21ని. లగాయతు 01:12ని.ల వరకు తిరిగి
మధ్యాహ్నం 02:55ని‌‌.ల లగాయతు 03:46ని.ల వరకు
రాహుకాలం ఉదయం 07:30ని.ల లగాయతు ఉదయం 09:00ని.ల వరకు
యమగండం ఉదయం 10:30ని.ల లగాయతు సాయంత్రం.12:00ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:52ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:20ని.లకు.

Daily Horoscope 2022 - 14

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!