ఈ రోజు రాశిఫలం: ఓ రాశివారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం

Published : Sep 12, 2022, 05:00 AM IST

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

PREV
113
ఈ రోజు రాశిఫలం: ఓ రాశివారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం
Aries Zodiac

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1): నూతన మిత్రుల పరిచయమై సాయం అందిస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. వాహన యోగం. కాంట్రాక్టులు పొందుతారు. ప్రయాణాలలో లాభాలు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

213
Taurus Zodiac

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):  ముఖ్యమైన  పనులలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది.ఉద్యోగాలలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు. సంతానం నుండి ధన వస్తు లాభం పొందుతారు.

313
Gemini Zodiac

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3): కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధు మిత్రుల కలయిక. వృత్తి వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. ఆర్దికాభివృద్ధి సాధిస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పెట్టుబడులకు తగిన లాభాలు. సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటా

413
Cancer Zodiac

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4): పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

513
Leo Zodiac

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1): విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. స్వల్ప ధన లాభం. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

613
Virgo Zodiac

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2): సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం.

713
Libra Zodiac

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3): నూతన వస్తు,వాహన ప్రాప్తి. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్దిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనదంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల అభివృద్ధి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

813
Scorpio

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4): ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ధన లాభం. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.బంధుమిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు.

913
Sagittarius Zodiac

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1): కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయిన తొలగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చిక్కులు. ఆకస్మిక ప్రయాణంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

1013
Capricorn Zodiac

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2): ఆర్థిక లావాదేవీలు లాభసటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆరోగ్యం పట్లశ్రద్ద అవసరం.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

1113
Aquarius

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3): పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.

1213
Pisces Zodiac

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): నూతన మిత్రుల పరిచయమై సాయం అందిస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. వాహన యోగం. కాంట్రాక్టులు పొందుతారు. ప్రయాణాలలో లాభాలు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

1313

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)                                                                                                                                                                                             
పంచాంగం :
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్షఋతువు
వారము: సోమవారం
పక్షం : కృష్ణపక్షము
తిథి : బ.విదియ మ.01.15ని. వరకు
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ.09.30ని. వరకు
వర్జ్యం : రా.09.27ని. నుండి రా.11.03ని.వరకు
దుర్ముహూర్తం :మ.12.21ని. నుండి మ. 01.10ని. వరకు తిరిగి మ.02.48ని. నుండి మ.3.37ని. వరకు  
రాహుకాలం: మ 1.30ని నుండి 3.00ని వరకు
యమగండం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:50ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:03ని.ల వరకు.  

Read more Photos on
click me!

Recommended Stories