ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి లక్ష్మీ దేవి ఆశీస్సులు

First Published Apr 23, 2023, 4:46 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ఉద్యోగవనందు అధికారుల తోటి విరోధాలు సమస్యలు ఏర్పడగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:        
తేది : 23ఏప్రిల్ 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-ఉత్తరాయణం
మాసం :- వైశాఖం
ఋతువు :- వసంత ఋతువు
పక్షం :-శుక్లపక్షం                                                                                       
వారము:-ఆదివారం
తిథి :-  తదియ ఉదయం 8.12 ని.వరకు
నక్షత్రం :       రోహిణి  రాత్రి 1.02 ని.వరకు
యోగం:- సౌభాగ్యం ఉ॥ 9: 02 ని.వరకు
కరణం:- గరజి ఉ॥ 8: 12 వణిజి రాత్రి 8.27 ని.వరకు
అమృత ఘడియలు: రాత్రి 9.42 ని.ల 11.22 ని.వరకు
వర్జ్యం:- సాయంత్రం 4.42 ని.ల 6.22 ని.వరకు
దుర్ముహూర్తం:-సా.04.33ని. నుండి సా.05.22ని. వరకు                             
 రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                  
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                   

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి వ్యాపార విషయాల గూర్చి చర్చిస్తారు. మనసునందుకు ఉత్సాహంగా ఉంటుంది. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆరోగ్యం బాగుండను. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లగలరు. భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడి ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ  శక్తి సామర్థ్యాలు తెలియగలవు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం లక్ష్మీ నరసింహాయ నమః శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

అకారణ  కోపాల వల్ల అన్ని విధాల నష్టాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలందు రాణింపు తగ్గును. మానసిక భయాందోళనలు ఇబ్బందులు ఏర్పడను. కుటుంబ సభ్యులు తోటి ఉద్రేకంగా వ్యవహరించారు. ఉద్యోగవనందు అధికారుల తోటి విరోధాలు సమస్యలు ఏర్పడగలవు. ఆదాయం అంతంత మాత్రమే లభించును. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రభుత్వ మూలక ఇబ్బందులు కలుగును. అనవసరమైన అధిక ఖర్చులు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల  ఆదర అభిమానాలు పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.  బంధువుల యొక్క కలయిక. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
తలపెట్టిన పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యిందు ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు . లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శారీరక శ్రమ అధికమై శరీర బాధలు పెరుగును. కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధపడతారు. చేయ పనులలో తొందరపాటు నిర్ణయాల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రుల తోటి కలహాల రావచ్చు. వస్తువులు యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాయై నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు కలసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజం నందు ప్రతిభ తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రజాభిమానం  పొందగలరు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
పట్టుదలతోచేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతో టీ సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును.
ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

చేయ వ్యవహారమనందు అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగును. శారీరకంగా అత్యధిక శ్రమ ఏర్పడుతుంది. సంతానం నుండి ప్రతికూలత వాతావరణ. ఇతరులతోటి అనవసర విరోధాలు ఏర్పడవచ్చు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. చేయు పని వారి తోటి ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం రాగలదు. అనవసరమైన ఆలోచనతోటి కాలయాపన చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడను. సమాజంలో అపవాదములు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ జపం చేయండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను.  మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి.  జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును. పట్టుదలతో చేయు పనులు పనులలో విజయం సాధిస్తారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని కొన్ని సంఘటనలు కలవరం  పెడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
గృహము నందు శుభకార్యా చరణ. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగమునందు అనుకోని మార్పులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మీకంటే పెద్దవారి  స్నేహములు కలిసి వచ్చును. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి . సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం నవదుర్గయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. సమాజము నందు మీ మాట విలువ తగ్గును. ఉద్యోగమునందు అధికారులతోటి పేచీలు ఏర్పడవచ్చు. మిత్రులు నమక ద్రోహం చేయాలని చూస్తారు. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీన పడుతుంది. కీలకమైన సమస్యలు పెరిగి మానసిక బాధలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. అనాలోచిత పనుల వలన ఇబ్బందులకు గురవుతారు. పని వారి తోటి ఇబ్బందులు రావచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
ప్రభుత్వ అధికారులతోటి గౌరవ మర్యాదలు పొందగలరు. కృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. చేయ పని యందు మంచి ఆలోచన శక్తితోటి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. చేయు వ్యవహారములు నూతన ఉత్సాహముతోటి చేస్తారు. మీరు అనుకున్న చోటు నుండి లాభాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

click me!