అక్షయ తృతీయ చాలా శుభకరమైన రోజు. ఈరోజున ఏ పనిచేసినా మంచే జరుగుతుంది. ముఖ్యంగా.. ఎందులో అయినా పెట్టుబడులు పెడితే ఆదాయం పెరుగుతుందట. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఎందులో పెట్టుబడులు పెడితే లాభాలు కలుగుతాయో.. ఓసారి చూద్దాం..
telugu astrology
1.మేష రాశి...
మేష రాశివారు ఈ అక్షయ తృతీయకు మమ్మూత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. అంతేకాదు.. ఏవైనా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినా వీరికి బాగా కలిసొస్తుంది.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశివారు ఏవైనా చిన్న చిన్న స్కీమ్ లు ముఖ్యంగా ఏవైనా ప్రభుత్వ స్కీముల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. దీని వల్ల నష్ట ఉండదు. లాభాలు వచ్చే అవకాశం ఉంది.
telugu astrology
3.మిథున రాశి..
ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్ లో పెట్టుబడులు పెట్టడం ఈ రాశివారికి మేలు చేస్తుంది. అంటే సినిమా లాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల పేరుకుపేరు, డబ్బుకు డబ్బు వస్తాయి.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఏవైనా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. లేదా ఏవైనా ట్రెడిషనల్ ఇన్వెస్టిమెంట్స్ లో పెట్టుబడులు పెడితే కూడా మేలు జరుగుతుంది. ఎఫ్డీ, పీఎఫ్ లాంటి వాటిల్లో పెట్టుకోవచ్చు.
telugu astrology
5.సింహ రాశి..
సింహ రాశివారు బంగారంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. దీని వల్ల భవిష్యత్తులో చాలా ఎక్కువ లాభాలు వస్తాయి.
telugu astrology
6.కన్య రాశి..
ఈ రాశివారు ఏదైనా వ్యాపారంలో ముఖ్యంగా, ఏదైనా మెటల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. అది మీకు మంచి చేస్తుంది. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెడుతుంది.
telugu astrology
7.తుల రాశి..
ఈ రాశివారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. ఇక్కడ పెట్టుబడులు సేఫ్ గా ఉంటాయి. ఫుడ్, గ్రాసెరీ మార్కెట్లలో పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి.
telugu astrology
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. లేదంటే గోల్డ్, ఎఫ్డీ, స్టాక్ మార్కెట్లు కూడా మంచిదే.
telugu astrology
9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు పెట్టుబడుల కోసం ఫిక్సడ్ డిపాజిట్ ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే.. బంగారంపై పెట్టుబడి అయినా భవిష్యత్తులో మేలు చేస్తుంది.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టిమెంట్స్ చూడొద్దు. ఈ రాశివారు బంగారం పై పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమమైన పని. చాలా లాభాలు వస్తాయి.
telugu astrology
11.కుంభ రాశి..
ఈ రాశివారు ఎక్కడెక్కడో కాకుండా విద్య కు పెట్టుబడి పెట్టడం ఉత్తమం. దాని వల్ల మీ స్టేటస్ పెరుగుతుంది. లాభాల బాట పట్టవచ్చు.
telugu astrology
12.మీన రాశి..
మీన రాశివారికి ఓపిక చాలా ఎక్కువ. కాబట్టి ఈ రాశివారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టిమెంట్స్ పెట్టడం మంచిది. స్టాక్ మార్కెట్లలో కూడా పెట్టొచ్చు.