ఇంటిపై రాహు కన్ను... ఈ చిట్కాతో అంతా అదృష్టమే..!

First Published Mar 31, 2021, 10:01 AM IST

నైరుతి మూలలో కదలకుండా ఉండే స్థిరమైన వస్తువులు, భారీ వస్తువులను ఉంచాలి. కాంతిని వెదజల్లే వస్తువులు, కదిలే వస్తువులు ఇక్కడ ఉంచకూడదు. ఈ మూలలో కిటికీలు కూడా ఉండకపోవడమే మంచిది.

వాస్తు..మన జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయని చాలా మంది అనుకుంటారు. ఏదైనా స్థలం, కొత్త ఇల్లు , కార్యాలయం కొనుగోలు చేసేటప్పుడు.. అది మనకు అనువైనదా కాదా.. అని చెక్ చేసుకుంటారు. చూసుకోకుండా నైరుతి దిక్కు ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే నైరుతి అంటే రాహు కి చాలా ఇష్టం అంట. ఆ వైపు ఎక్కువగా ఆకర్షితుడు అవుతాడట. మరి.. రాహు ప్రభావం పడిన తర్వాత మంచి జరుగుతుందా అంటే.. చెప్పడం కష్టమే. మరి రాహు దోషం తొలిగి.. మనం ఆనందంగా ఉండాలంటే.. కొన్ని వాస్తు మార్పులు చేసుకోవాల్సిందే.
undefined
బెడ్రూంపై రాహు ప్రభావం పడితే.. నిత్యం నిద్ర పోవాలని అనిపిస్తూ ఉంటుంది. బద్దకం పెరిగిపోతుంది. అనారోగ్యం బారిన పడతారు. ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా కెరిర్ చాలా వెనకపడే అవకాశం ఉంది.
undefined
కాబట్టి.. నైరుతి మూలలో కదలకుండా ఉండే స్థిరమైన వస్తువులు, భారీ వస్తువులను ఉంచాలి. కాంతిని వెదజల్లే వస్తువులు, కదిలే వస్తువులు ఇక్కడ ఉంచకూడదు. ఈ మూలలో కిటికీలు కూడా ఉండకపోవడమే మంచిది.
undefined
నైరుతి వైపున డ్రైనేజీలు, నిచ్చెనలు , వాటర్ ట్యాంకులు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే.. ఇంట్లో సంపద నిలవదు. ధనలక్ష్మి రోజురోజుకీ క్షీణించుకుపోతుంది.
undefined
రాహువు ఉన్నవైపు ప్రదేశం ఎక్కువ ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే.. జీవితంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి.
undefined
రాహువును నీడ గ్రహం అంటారు. సూర్యరశ్మి ఈ దిశకు చేరదు. మీరు ఈ ప్రదేశంలోని గోడలకు ప్రకాశవంతమైన రంగు కంటే ముదురు రంగు వేయడం బెటర్.
undefined
అల్మరా, కప్ బోర్డ్స్ వంటి భారీ వస్తువులను నైరుతిలో ఉంచడం వల్ల మంచి జరుగుతుంది.
undefined
నైరుతి దిక్కులో ఇంటికి గేటు ఉండకూడదు. అలా కాకుండా ఒక వేళ నైరుతి వైపు గేటు ఉంటే.. దానికి ఎదురుగా ఇంకా ఏదైనా ఇల్లు ఉంటే మాత్రం ఏమీ కాదు.
undefined
ఇంటి గుమ్మం ఎదురుగా.. పొలాలు ఉండటం కూడా అంత మంచిదేమీ కాదు.
undefined
click me!