డబ్బు మీద ఆశ అందరికీ ఉంటుంది. కొందరికి ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదంచాలని అనుకుంటూ ఉంటారు. కానీ.... కొందరు మాత్రం... పెళ్లి ద్వారా డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారు. అంటే.. మంచిగా డబ్బున్న అమ్మాయిని పడేస్తే.. ఈజీగా లక్షాదికారులం అవ్వొచ్చుకుంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది అబ్బాయిలు ఎక్కువగానే ఇలానే ఆలోచిస్తారు. ఎప్పుడూ డబ్బు ఉన్న అమ్మాయిల వైపే చూస్తారు. మరి అలాంటి రాశులేంటో చూద్దాం..
telugu astrology
1.వృషభ రాశి..
వృషభ రాశి అబ్బాయిలు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఏది చేసినా తమకు లాభం కలుగుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. వృషభ రాశి పురుషులు విజయం , శ్రేయస్సును ప్రసరింపజేసే భాగస్వామి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. డబ్బు ఉన్న అమ్మాయిని చేసుకుంటే.. ఆర్థిక భద్రత పెరుగుతుందని భావిస్తారు.
telugu astrology
2.సింహ రాశి..
సింహ రాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు కోరుకున్న దానిని పొందడానికి ఈ రాశివారు అస్సలు భయపడరు. ఈ రాశివారిలో మ్యాగ్నటిక్ లక్షణాలు ఉంటాయి. అందరినీ ఇట్టే ఆకర్షించగలరు. అయితే.. ఈ రాశివారు తమ జీవితంలోకి డబ్బు ఎక్కువగా ఉన్న అమ్మాయి రావాలని కోరుకుంటారు.
telugu astrology
3.తుల రాశి..
తుల రాశివారు కూడా ఎక్కువగా లగ్జరీ లైఫ్ ని కోరుకుంటారు. ఈ రాశికి చెందిన పురుషులు ఎప్పుడూ ట్రెండీగా ఉండాలని అనుకుంటారు. ఈ రాశివారు అందరినీ అంత తొందరగా ఇష్టపడరు. తమకు లగ్జరీ లైఫ్ అందడానికి ఎవరితో ఉంటే బాగుంటుందో చూసుకొని మరీ సెలక్ట్ చేసుకుంటారు. సంపద పై వీరి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
telugu astrology
4.మీన రాశి..
మీన రాశివారికి చెందిన పురుషులు ఎవరినైనా ఇట్టే ఆకర్షించేయగలరు. వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ రాశివారు నమ్మకానీ, ఎమోషన్స్ కి ఎక్కువ విలువ ఇవ్వరు. కేవలం భౌతిక సంపదపైనే వీరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ డబ్బు ఉన్న అమ్మాయిలనే తమ జీవితంలోకి ఆహ్వానించాలి అని అనుకుంటూ ఉంటారు.