వార ఫలాలు..(27 మార్చి నుంచి 02 ఏప్రిల్ వరకు)

First Published Mar 27, 2020, 3:17 PM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
మేషరాశికి :- ఈ వారం ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆర్థిక లావాదేవీలు ముగింపునకొస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్ కార్య చరణకై వేడుకలు సన్నాహాల ఆలోనలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి :- ఈ వారం ఖర్చులు విరీతం. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. రాబడిపై దృష్టిపెడతారు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ప్రముఖుల దర్శనీయం వీలుపడదు. మీ జీవిత భాగస్వామి వైఖరిలో మార్పువస్తుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. లౌక్యంగా వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. బంధుమిత్రులు వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిథునరాశి :- ఈ వారం మనోధైర్యంతో ముందుకు సాగండి, సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కృషి ఫలించకున్నా ప్రయత్నించామన్న సంతృప్తి ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఆదాయం వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్రవారాల్లో ఊహించని ఖర్చులు ఉంటాయి ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దంపతుల మధ్య అమరికలు తగదు. సంతానం, భివిష్యత్‌పై దృష్టిపెడతారు. కొంచం ఒత్తిడి, శ్రమ అధికం. ఆదాయాభివృద్ధి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి:- ఈ వారం బంధువుత్వాలు బలపడతాయి. ఉన్నత పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. సంతానం విషయంలో శుభపరిణామాలు ఉంటాయి. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. గృహమార్పు కలిసి వస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి:-ఈ వారం గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ బాధలు తొలగుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మానసికంగా కుదుటపడతారు. పనుల్లో ఆటంకాలెదురవుతాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. వ్యాపకాలు, పరిచయాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆది, సోమవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. వాహనాలు నడిపేప్పుడు దూకుడు తగదు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి:- ఈ వారం బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యంకాని, హామీలివ్వవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యవహారానుకూలత ఉంది. మంగళ, బుధవారాల్లో అనుకూలం, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. మీ ప్రమేయం అనివార్యం. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఒత్తిడి, శ్రమ అధికం. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి:- ఈ వారం పరియాలు బలపడతాయి. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆదాయం బాగుటుంది. చిన్న చిన్న సమస్యల మినహా ఇబ్బందులుండవు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వ్యతిరేకులు తారసపడతారు. సాధ్యకాని హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. గురు, ఆదివారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం దూకుడును కట్టడి చేయండి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారుల తీరు ఇబ్బంది కలిగిస్తుంది. ఎవరితోనూ భేషజాలకు పోవద్దు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి:- ఈ వారం బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. జీవిత భాగస్వామి సలహా పాటించండి. ఆత్మీయులను కలుసుకుంటారు. అనుకూలతులున్నాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఖర్చులు అధికం. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. శుక్ర, శనివారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. నిర్మాణాలు, మరమ్మతులు ముగింపునకు వస్తాయి. శ్రమ, ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి:-ఈ వారం పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. సోమ, మంగళవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి:- ఈ వారం అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనూకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార మార్పులు వద్దు, ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి:- ఈ వారం కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయులను కలుసుకుంటారు. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక అహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మార్పు అనివార్యం అనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి:- ఈ వారం బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరికీ బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలప దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు. గృహమార్పునకు అనుకూలం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. బెట్టింగ్‌లు, జూదాల జోలికి పోవద్దు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .
undefined
click me!