వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఈ రాశివారి అభిప్రాయం ఇదే..!

Published : Sep 25, 2021, 03:03 PM IST

కొందరు ఆఫీసులు తెరవండిరా బాబు అంటూ మొత్తుకుంటుంటే.. కొందరు మాత్రం.. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు. మాకు ఇదే హాయిగా ఉందని అనుకుంటున్నారు. అలా అనుకుంటున్న రాశులేంటో ఓసారి చూస్తే..

PREV
17
వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఈ రాశివారి అభిప్రాయం ఇదే..!

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నుంచి ఆఫీసులు మూతపడ్డాయి. ఈ విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అందరూ వర్క్ ఫ్రమ్ కి పరిమితమయ్యారు.   సంవత్సరం గడిచి రెండో సంవత్సరం మొదలైనా ఇంకా ఆఫీసులు తెరుచుకోలేదు. దీంతో.. కొందరు ఆఫీసులు తెరవండిరా బాబు అంటూ మొత్తుకుంటుంటే.. కొందరు మాత్రం.. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు. మాకు ఇదే హాయిగా ఉందని అనుకుంటున్నారు. అలా అనుకుంటున్న రాశులేంటో ఓసారి చూస్తే..

27

వృషభ రాశి..
ఈ రాశివారు చాలా మొండిగా ఉంటారు.  అయితే.. తమ మనసులోని విషయాలను బయటకు చెప్పడానికి వీరు పెద్దగా ఆసక్తి చూపించరు. సమాజానికి దూరంగా ఉండాలని అనుకుంటారు. అందరితో కలిసి ఉంటే తమ లోపాలు బయటపడతాయని వారు భయపడుతుంటారు. అందుకే..  వీరు.. ఆఫీసు కంటే.. వర్క్ ఫ్రమ్ నే కన్వినెంట్ గా ఫీలౌతుంటారు.

37

కర్కాటక రాశి..

ఈ రాశివారు ఒంటరితనాన్ని కోరుకోరు. కానీ.. తమ చుట్టూ ఎప్పుడూ తమకు ఇష్టమైన వారు.. తమ కుటుంబసభ్యులు ఉండాలని కోరుకుంటారు.  ఈ క్రమంలోనే వీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ని కోరుకుంటారు. ఆఫీసుకు వెళితే..  తమవారు దూరమైపోతారేమో అని భయపడిపోతుంటారు. ఈ రాశివారు ఏవైనా ఆఫీసు ఈవెంట్స్ జరిగితే.. అందరితో కలవకుండా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.
 

47

కన్య రాశి..
ఈ రాశివారు కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు. అందుకే ఎక్కువగా  ఎవరితోనూ మింగిల్ అవ్వలేరు. దూరంగా ఉంటారు. ఇతరుల నుంచి కూడా అదే ఆశిస్తారు. ఈ లక్షణం కారణంగా వీరిని ఇతరుల నుంచి దూరం చేస్తుంది.  అంతేకాకుండా ఈ రాశివారికి కాస్త శుభ్రత ఎక్కువ, ఈ కారణంగా కూడా వీరు  అందరితోనూ స్నేహంగా ఉండలేరు. బ్యాక్టీరియా భయం చాలా ఎక్కువ. కాబట్టి.. వీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని కోరుకుంటారు.

57

వృశ్చిక రాశి..

ఈ రాశివారు ఇంట్రావర్ట్స్ కాదు, కానీ అన్ని విషయాలను షేర్ చేసుకోలేరు.  కొన్ని విషయాలను తమలో తామే దాచుకుంటారు. ఒక షెల్ లో ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువగా తమ ఆలోచనలు, రహస్యాలను తమతోనే ఉంచుకోవడానికి ఇష్టపడతారు. వీరు చాలా కొద్ది మందిని మాత్రమే గుడ్డిగా నమ్ముతారు. వీరికి ఆఫీసు రాజకీయాలు నచ్చవు. అందుకే.. వీరు వర్క్  ఫ్రమ్ హోమ్ ఇష్టపడతారు.
 

67

మకరరాశి..
ఈ రాశివారు ఇంట్రావర్ట్స్ అస్సలు కాదు. అన్ని రాశులకంటే తక్కువ ఇంట్రావర్ట్స్ అంటే వీరినే చెప్పాలి. వీరు కొద్దిగా ఎక్ట్స్ ట్రావర్ట్స్ అనే  చెప్పాలి. అయితే.. వీరు తాము తీసుకునే నిర్ణయాలు ఎవరికీ చెప్పాలని అనుకోరు. అందుకే వీరిని అందరూ ఇంట్రావర్టర్స్ అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యంగా ఫీలౌతూ ఉంటా

77

కుంభ రాశి
ఈ రాశివారు చాలా కామ్ గా ఉంటారు.చాలా ప్రశాంతంగా ఉంటారు. సోషలైజ్ అవ్వడానికి పెద్దగా ఇష్టపడరు. కామ్ గా ఉంటారు కానీ బోరింగ్ పర్సన్ మాత్రం కాదు. వీరితో ఉన్నవారికి హాయిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి అమ్మాయిలు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఈ రాశివారు తమ స్నేహితులు, కుటుంబసభ్యులతో బాగానే ఉంటారు కానీ..ఆఫీసు కార్యక్రమాల్లో అంత చురుకుగా పాల్గొనరు. బయటివారితో ఉత్సాహంగా ఉండలేరు. కాబట్టి వీరు వర్క్ ఫ్రమ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. 

click me!

Recommended Stories