దుస్తులను ఎవరి ఎంపికను బట్టి వారు ధరిస్తారు. దుస్తులను బట్టి, వారి స్వభావాన్ని చెప్పొచ్చు అని చెబుతూ ఉంటారు.మనం ధరించే బట్టలు లేదా దుస్తుల రంగులు కూడా వ్యక్తిగత అభిరుచి, సాంస్కృతిక నేపథ్యం, జీవనశైలి ఎంపికలకు సంబంధించినవి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఫ్యాషన్ అనేది స్వభావానికి ,రాశికి సంబంధించినది. కొంతమందిని చూడండి, వారు ఎప్పుడూ రంగురంగుల దుస్తులు ధరిస్తారు. ప్రకాశవంతమైన, మెరిసే రంగులను ధరించడానికి ఇష్టపడతారు. నలుగురితో కలసి వస్తే ప్రత్యేకతను చాటుకోవడానికి చిత్రమైన డ్రెస్సులు వేసుకునేవారూ ఉన్నారు. రకరకాలుగా దుస్తులు ధరించడం కూడా ఒక కళ. అయితే, జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశులవారు ఎప్పుడూ రంగురంగుల, మరింత శక్తివంతమైన దుస్తులను ధరించడంలో ముందుంటారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...