
1.మేష రాశి..
మేష రాశివారికి కాస్త మెచ్యూరిటీ చాలా తక్కువ. రెండేళ్ల చిన్నపిల్లల్లో ఎంత మెచ్యూరిటీ ఉంటుందో.... ఈ రాశివారికి కూడా అంతే ఉంటుంది. చాక్లెట్స్ కావాలని చిన్నపిల్లలు ఎలా మారం చేస్తారో... అదేవిధంగా... ఈ రాశివారు అన్ని విషయాల్లో చిన్న పిల్లల్లా చేస్తారు. వీరి మెచ్యూరిటీ అలానే ఉంటుంది.
2.వృషభ రాశి..
ఈ రాశివారు 30ఏళ్ల వచ్చిన తర్వాత తాము ప్రపంచం గురించి తెలుసుకున్నాం అని భావిస్తారు. అప్పటి వరకు వారు తమకు ప్రపంచం గురించి ఏమీ తెలియనట్లుగానే భావిస్తారు. 30ఏళ్ల వస్తే తప్ప తమకు మెచ్యూరిటీ రాదని వారు కూడా భావిస్తారు.
3.మిథున రాశి..
ఈ రాశివారికి కూడా కాస్త మెచ్యూరిటీ తక్కువ అనే చెప్పాలి. ఎక్కువగా అందరిపై గాసిప్స్ చెబుతూ ఉంటారు. మెచ్యూర్డ్ గా ఆలోచించడం వీరికి రాదు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారికి కాస్త మెచ్యూరిటీ చాలా ఎక్కువ. చిన్న వయసులోనే పెద్ద వారిగా ఆలోచిస్తారు. వయసుకు మించి అందరి గురించి ఆలోచిస్తారు. వీరికి స్వార్థం చాలా తక్కువ అనే చెప్పాలి.
5.సింహ రాశి..
ఈ రాశివారి మెచ్యూరిటీ ఆరేళ్ల పిల్లాడి దగ్గరే ఆగిపోయింది. తమ బొమ్మల విషయంలో.. పేరెంట్స్ దగ్గర ఆరేళ్ల పిల్లలు ఎలా చేస్తారో.... ఈ రాశివారు అంతే చేస్తారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు చదువు అయిపోయి... పేరెంట్స్ కి దూరంగా ఉద్యోగం కోసం వెళ్లినవారు ఎలా ఉంటారో అలా ఉంటుంది ఈ రాశివారి మెచ్యూరిటీ. కొత్తగా ఉద్యోగంలోకి అడుగుపెట్టినవారి మెచ్యూరిటీ లానే వీరు కూడా ఆలోచిస్తారు.
7.తుల రాశి..
తుల రాశివారికి కాస్త మెచ్యూరిటీ చాలా తక్కువ అని చెప్పాలి. ఈ రాశివారు టీనేజర్స్ మెంటాలిటీని కలిగి ఉంటారు. ఎప్పుడూ సరదాగా ఆటలు ఆడుతూ.. ఫన్నీగా ఉండాలని వీరు భావిస్తారు.
8.వృశ్చిక రాశి.
ఈ రాశివారి మెచ్యూరిటీ 20ఏళ్ల యువకుడి దగ్గరే ఆగిపోయింది. రెబల్ గా ప్రవర్తిస్తారు. అన్నీ రూల్స్ బ్రేక్ చేయడం, కోపంగా, ప్రతి విషయంలో అందరినీ ప్రశ్నించడం లాంటివి చేస్తూ ఉంటారు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి కూడా మెచ్యూరిటీ తక్కువ అనే చెప్పాలి. 5ఏళ్ల పిల్లాడు... సూపర్ మార్కెట్ కి వెళ్లి బొమ్మ కోసం.. కింద పడి ఏడుస్తారు చూడు.. అలా చేస్తారు ఈ రాశివారు. అంతే ఉంటుంది ఈ రాశివారి మెచ్యూరిటీ.
10.మకర రాశి..
మకర రాశివారికి కాస్త మెచ్యూరిటీ చాలా ఎక్కువ అని చెప్పాలి. వీరు 40ఏళ్ల వారిలా ఆలోచిస్తారు. చాలా మెచ్యూరిటీ. పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారు.
11.కుంభ రాశి..
వీరికి మెచ్యూరిటీ కాస్త పర్లేదు అని చెప్పాలి. ఇతర రాశులతో పోలిస్తే.. వీరికి మెచ్యూరిటీ ఉందని చెప్పాలి. కాకపోతే.. అప్పుడప్పుడు కాలేజీ కుర్రాళ్లలాగా ప్రవర్తిస్తారు.
12.మీన రాశి..
ఈ రాశివారికి మెచ్యూరిటీ ఒక్కోసారి చాలా ఎక్కువగా.. మరోసారి చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కేర్ ఫ్రీ బేబీకి ఎంత మెచ్యూరిటీ ఉంటుందో.. ఈ రాశివారికి కూడా అంతే ఉంటుంది. అయితే... ఒక్కోసారి చాలా పెద్దవారిలా కూడా ప్రవర్తించి.. సమస్యలను పరిష్కరిస్తారు.