నవరాత్రులలో ఈ రాశులవారికి భక్తి పొంగిపోతుంది...!

First Published Sep 30, 2022, 10:42 AM IST

 జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారు ఈ నవరాత్రులలో చాలా భక్తితో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మామూలు సమయంలో పెద్దగా భక్తి లేకపోయినా...  ఈ నవరాత్రులలో మాత్రం వీరికి భక్తి పొంగి పొర్లుతుంది. 

Weekly Horoscope

నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రులను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు... అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా... జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారు ఈ నవరాత్రులలో చాలా భక్తితో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మామూలు సమయంలో పెద్దగా భక్తి లేకపోయినా...  ఈ నవరాత్రులలో మాత్రం వీరికి భక్తి పొంగి పొర్లుతుంది. మరి  ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

Zodiac Sign

1.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. దుర్గాదేవి శక్తి గొప్పదిగా వీరు భావిస్తారు.  కర్కాటక రాశివారు తమ రోజులను ధ్యానిస్తూ, పరమాత్మను స్తుతిస్తూ గడపడానికి ఇష్టపడతారు. కాబట్టి నవరాత్రి పండుగ వారికి భగవంతునితో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయంగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు నిష్టతో పూజలు చేస్తారు.

Zodiac Sign

2.ధనస్సు రాశి..

ఈ నవరాత్రులలో ఈ రాశివారిలో భక్తి పొంగి పొర్లుతుంది. ఆధ్యాత్మికతను నమ్మడం వల్ల.. తమను తాము కనుగొనగలమని వారు నమ్ముతుంటారు. ప్రపంచాన్ని అమ్మవారే రక్షిస్తూ ఉంటారని వారు నమ్ముతుంటారు. ఈ రాశివారు ఈ నవరాత్రుల్లో అవసరమైన వారికి సహాయం చేయడంలో ముందుంటారు. ఆధ్యాత్మిక భావాలలో మునిగి తేలుతారు.
 

Zodiac Sign

3.మీన రాశి..

వీరు రాశిచక్రంలో అత్యంత ఆధ్యాత్మికంగా ప్రసిద్ది చెందారు. ఆధ్యాత్మికత అనేది వారి అంతర్గత భావాలతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని వారు భావిస్తారు. దేవుడికి మంత్రాలు పఠించడం ద్వారా, వారి సేవలో తమను తాము సమర్పించుకోవడం ద్వారా.. తమను తాము ఉన్నత వ్యక్తిగా భావిస్తూ ఉంటారు.

Zodiac Sign

4.సింహ రాశి..

వారు ఆధ్యాత్మికత పట్ల చాలా ఆశాజనకంగా ఉన్నారు. ఏదైనా పనిలో విజయం సాధించాల్సినప్పుడు వీరు అమ్మవారికి పూజలు చేస్తారు. వారు నవరాత్రి సమయంలో ధ్యానం లేదా మంత్రాలు పఠిస్తూ తమ సమయాన్ని వెచ్చిస్తారు. దేవుణ్ణి ఆరాధించడానికి అందరినీ ఆహ్వానించడం కూడా వారికి చాలా ఇష్టం.

Zodiac Sign


5.వృశ్చిక రాశి..

నవరాత్రులు సమీపించేటప్పుడు, వారు ప్రశాంతంగా ఉంటారు. వారి మానసిక స్థితి చాలా ప్రశాంతంగా మారుతుంది.వారు తమను తాము ఆధ్యాత్మికతకు అంకితం చేసుకుంటారు. వారు  మంత్రాలు జపిస్తూ, దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తూ పూర్తి భక్తిభావంతో ఉంటారు. ఇతరులతో కలిసి పండుగను ఎంజాయ్ చేయడం గురించి పట్టించుకోరు. అమ్మవారిని సేవలో మునిగి తేలితే... పాపాలు పోతాయి అని వారు భావిస్తారు.
 

click me!