ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి తమను ఎంతో ప్రేమించాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు మనకు తెలియకుండానే మన భాగస్వామిని ఎంచుకుంటాం. అర్థం చేసుకునే, ప్రేమించే వ్యక్తులు జీవిత భాగస్వాములుగా రావాలని అందరూ ఆశపడతారు. ఇకపోతే కొన్ని రాశుల వారు ఇతరులకంటే తమ భాగస్వాములను ఎక్కువగా ప్రేమిస్తారు. అంతేకాదు వీళ్లు చాలా రొమాంటిక్ కూడా. అందుకే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టకముందే జీవిత భాగస్వామితో అన్ని హద్దులు దాటుతారు. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..