ఈ రాశులవారు పెళ్లి చేసుకుంటే నరకం చూస్తారు..!

First Published | Jul 18, 2023, 10:19 AM IST

వారి మధ్య సమస్యలు రావడానికి కారణమౌతాయి. ఇది చివరికి వారి మధ్య అపార్థాలకు కారణం అవుతుంది. దీని వల్ల వారి మధ్య సమస్యలు రావడం మొదలౌతాయి.


దాంపత్య జీవితం కొందరిది చాలా ఆనందంగా ఉంటుంది. కానీ, కొందరు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. ఎప్పెడుప్పుడు విడిపోదామా అని అనుకుంటూ ఉంటారు. అలా వారి మధ్య సమస్యలు రావడానికి జోతిష్యం కూడా కారణం కావచ్చట. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశులవారు పెళ్లి చేసుకుంటే, జీవితంలో నరకం చూస్తారట. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం..
 

1.మేషం,కర్కాటకం

మేషం వారి దృఢత్వం, స్వతంత్ర స్వభావానికి ప్రసిద్ధి చెందింది, కర్కాటక రాశివారు మాత్రం సున్నితంగా ఉంటారు, వారికి నిత్యం ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఈ క్రమంలో మేష రాశివారి ప్రవర్తన కర్కాటక రాశివారిని బాధిస్తుంది. దీంతో, వారి మధ్య సమస్యలు రావడానికి కారణమౌతాయి. ఇది చివరికి వారి మధ్య అపార్థాలకు కారణం అవుతుంది. దీని వల్ల వారి మధ్య సమస్యలు రావడం మొదలౌతాయి.
 


telugu astrology

2.వృషభం, కుంభ రాశి..
వృషభం స్థిరత్వం, సంప్రదాయానికి విలువనిస్తారు. ఇక కుంభ రాశి వారు స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఉంటారు వృషభం భద్రతను కోరుకుంటారు. కుంభ రాశివారు నిర్లిప్త ధోరణితో అసౌకర్యంగా  ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రాధాన్యతలు , జీవనశైలి ఎంపికలలో ఈ అసమతుల్యత పరస్పరం అవసరాలను అర్థం చేసుకోవడంలో విభేదాలు, ఇబ్బందులకు దారి తీస్తుంది.

telugu astrology

3.మిథున రాశి, కన్య రాశి..
మిథున రాశివారు  అనుకూలత, స్నేహశీలియైన స్వభావం కలిగి ఉంటారు. కన్య  రాశివారు ఆచరణాత్మక , విశ్లేషణాత్మక మనస్తత్వంతో ఉంటారు. వీరి మనస్థత్వాలు అస్సలు కలవవు. దీంతో, వీరి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీరి మధ్య కనీసం సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. అందుకే ఈ రెండు రాశుల వారు పెళ్లి  చేసుకుంటే, వారి బంధం చాలా కష్టంగా ఉంటుంది. 

telugu astrology

4.సింహ రాశి, వృశ్చిక రాశి..

సింహరాశికి శ్రద్ధ  ఎక్కువ. వీరికి ప్రశంసలు ఎక్కువగా కావాలి. ఈ రాశివారికి వృశ్చిక రాశి వారికి అస్సలు సెట్ అవ్వదు. వీరి మనస్థత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటాయి. ఒకరు ప్రశంసలు కోరుకుంటే, మరి కొందరు విమర్శిస్తూ ఉంటారు. దీని వల్ల ఈ రెండు రాశుల వారి కాపురం ఛిన్నా భిన్నంగా ఉంటుంది.

telugu astrology


5.తుల రాశి, మకర రాశి..

తుల రాశివారు సామరస్యం కోరుకుంటారు. వీరు తొందరగా రాజీ పడటానికి ముందుకు వస్తారు. కానీ, మకర రాశివారు మాత్రం అలా కాదు ఆచరణాత్మకంగా, ఆశయంగా ఉంటారు. దీని వల్ల ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ గొడవలు, మనస్పర్థలు వస్తూ ఉంటాయి. ఈ రెండు రాశుల కాపురం కూడా అస్తవ్యస్తంగా మారుతుంది.

Latest Videos

click me!