నిజానికి వృషభ రాశివారు చాలా నమ్మకమైన వ్యక్తులు. ఈ రాశివారు తమ స్నేహితులు, జీవిత భాగస్వామి.. ఎలా తమను నమ్మివచ్చిన వారు ఎవరినీ మోసం చేయరు. వారితో చాలా నమ్మకంగా ఉంటారు. అయినప్పటికీ... వీరి వద్ద ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉంటాయి. మరి వృషభ రాశివారి డార్క్ సైడ్ ఏంటో తెలుసుకుందామా...
Astro
వృషభ రాశివారు క్షమాపణలు చెప్పడానికి ఇష్టపడరు. తప్పు తమది ఉన్నా.. లేకున్నా సరే.. క్షమాణలు చెప్పడం వారికి నచ్చదు. వీరికి మొండి పట్టుదల కాస్త ఎక్కువ. వారు ఎంచుకున్న మార్గమే సరైనది అని వీరు భావిస్తూ ఉంటారు. ఆ విషయంలో ఎవరు ఎలాంటి సలహా ఇచ్చినా వీరు తీసుకోరు. దీని వల్ల కొందరితో సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది.
taurus
ఈ రాశివారికి ఎమోషనల్ ఫీలింగ్ చాలా తక్కువ. సందర్భాన్ని బట్టి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు ఎలా పోయినా.. తమ శాంతి, ఆనందం తమకు దక్కాలని అనుకుంటూ ఉంటారు. వారి స్వీయ రక్షణ కోసం ఎవరిని వదులుకోవడానికైనా వీరు సిద్ధంగా ఉంటారు. ఎమోషనల్ బాండింగ్ చాలా తక్కువ. ఎవరితోనూ ఎక్కువగా బాండింగ్ పెంచుకోరు. పెంచుకుంటే వారితో సమస్యలు వస్తాయని వారు భావిస్తూ ఉంటారు.
Taurus
ఎవరైనా తమకు ప్రతి విషయంలో అడ్డుగా నిలుస్తే... వీరికి విపరీతంగా కోపం వస్తుంది. వారిపై ప్రతీకారం తీర్చుకునేదాక వారికి నిద్రపట్టదు. వీరికి పగ, ప్రతీకారాలు ఎక్కువ. వీరు ప్రశాంతంగా ఉన్నంత వరకే మంచివారు. అలా కాకుండా కోపం వచ్చిందా ఇక అంతే... ఉగ్రరూపం దాల్చి ప్రతీకారం తీర్చుకుంటారు.