మకర రాశి భూమికి సంకేతం. ఈ రాశివారిని శని పాలిస్తూ ఉంటుంది. మకర రాశివారు విపరీతమైన భౌతికవాదం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతిష్టాత్మకంగా ఉంటారు, ఎంతగా అంటే, వారు డబ్బు సంపాదించడం, విజయం సాధించడంపై ఎక్కువ దృష్టి పెడతారు, పని పట్ల వారి అంకితభావం ఎక్కువ. తమలాగే పని పట్ల అందరూ ప్రవర్తించకుంటే వీరికి నచ్చదు. నిర్దాక్షిణ్యంగా తమ టీమ్ ని తొలగించడానికి ఏ మాత్రం వెనకాడరు. వీరికి సానుభూతి తక్కువ. నెమ్మదిగా ఉండేవారు, సోమరితనం, అసమర్థ వ్యక్తులు వీరికి నచ్చరు. అలాంటి వారిని వీరు కొంచెం కూడా క్షమించరు. అందరూ ఒకే స్థాయిలో పనిచేయలేరు. కానీ అది మకరరాశికి అర్థం కాదు.