Aries Traits
ప్రతి ఒక్కరూ మనకు పైకి కనిపించేంత మంచివారేమీ కాదు. అందరిలోనూ ఓ డార్క్ సైడ్ ఉంటుంది. కొందరు తమ డార్క్ సైడ్ ని కూడా అందరికీ కనిపించేలా చేస్తారు. కొందరు మాత్రం ఆ సైడ్ యాంగిల్ కి ఎవరి ముందు బయటపడకుండా జాగ్రత్తపడుతుంటారు.
Aries Zodiac
మేష రాశివారు కూడా పైకి చాలా మంచివారిలా..... ఇతరుల కోసం సహాయపడేవారిలా, ఇతరుల కోసమే బతుకుతున్నవారిలా కనిపిస్తారు. కానీ వారిలోనూ ఓ డార్క్ సైడ్ ఉంది. వారిలోనూ ప్రతికూలతలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
ఇతరుల కంటే ముందంజలో ఉండాలని కోరుకోవడం గొప్ప విషయమే . కానీ మేష రాశివారు ప్రతివిషయంలోనూ ఇతరులతో పోటీ పడాలని చూస్తారు. ఆ పోటీ వారికి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా.. ఇతరులు గెలవడాన్ని మాత్రం జీర్ణించుకోలేరు. దానికోసమే వారు పోటీపడుతూ ఉంటారు. ఇక పోటీతత్వం కూడా ఆఱోగ్యంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ... వీరు ఆ పోటీని హెల్దీగా ఉండనివ్వరు. గెలవడం కోసం... అందరి ముందు తాము గొప్ప అనిపించుకోవడానికి స్వార్థంగా ఆలోచిస్తారు.
మేషరాశి వారు మొండిగా ఉంటారు. వారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు. దాని కోసం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. ఈ మొండితనం అహంకారంగా వేరొక వ్యక్తి దృక్కోణాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడరు. వారు వినాలనుకున్నప్పుడు కానీ వినడానికి ఇష్టపడనప్పుడు సమస్య తలెత్తుతుంది. వారు తమ మార్గంలో పనులు చేయాలనుకుంటున్నారు. ఇది కొన్నిసార్లు ఒక అబ్సెషన్. ఇది చాలా నియంత్రణ ప్రవర్తనకు దారి తీస్తుంది, ఈక్రమంలో వీరికి కోపం కూడా విపరీతంగా వచ్చేస్తుంది.
మేష రాశివారు చాలా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికంగా ఉంటారు. ఈ రాశివారు తాముఇష్టపడే వారిని సంతోషరపచడానికి సర్ ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు.. మేషం ప్రేమలో ఉన్నప్పుడు విధేయత అనుసరిస్తుంది. అయితే...ఎవరైనా తమను మోసం చేస్తే... ఈ రాశివారు జీర్ణించుకోలేరు. పగ తీర్చుకునేవరకు ఊరుకోరు. తమను బాధపెట్టిన, మోసం చేసిన వ్యక్తిని అందరి ముందు బహిర్గతం చేసేదాకా వీరు నిద్రపోరు. తమను మోసం చేసినందుకు జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేస్తారు.