telugu astrology
1.మేష రాశి..
సూర్య గ్రహణ ప్రభావం మేష రాశిపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మేష రాశివారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. దీని కారణంగా.. వీరి మానసిక ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందట. కాబట్టి... ఈ విషయంలో మేష రాశివారు జాగ్రత్తపడాలి.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశివారికి డైరెక్ట్ గా ప్రభావం చూపించకపోయినా....ఈ రాశివారి కుటుంబసభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే... ఈ రాశివారు ఈ సమయంలో తమ ఆరోగ్యంతో పాటు... తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశివారిని గ్యాస్ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారిపై సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి.... ఈ సమయంలో మీతో పాటు.. మీ కుటుం సభ్యుల ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి.
telugu astrology
5.సింహ రాశి..
సింహ రాశివారు ప్రయాణాల సమయంలో జాగ్రత్త వహించాలి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి.. ఈ సమయంలో చాలా జాగ్రత్తపడాలి.
telugu astrology
6.కన్య రాశి...
సూర్య గ్రహణం కారణంగా... కన్య రాశివారి ఆరోగ్యం పై హెచ్చతగ్గులు కనపడే అవకాశం ఉంది. అయితే.. మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు.
telugu astrology
7.తుల రాశి...
సూర్యగ్రహణం తుల రాశివారి వారిపై మంచి ప్రభావమే చూపుతుంది. ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి లైఫ్ స్టైల్ మార్చుకుంటే.. ఆరోగ్యం మరింత బాగుంటుంది.
telugu astrology
8.వృశ్చిక రాశి..
ఈ సూర్య గ్రహణం... వృశ్చిక రాశివారి కంటి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపించనుంది. ఈ క్రమంలో వీరు కంటికి రెస్ట్ ఎక్కువగా ఇవ్వడం చాలా ముఖ్యం.
telugu astrology
9.ధనస్సు రాశి..
గత కొంతకాలంగా మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే.... ఆ సమస్యకు ఇప్పుడు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆ సమస్య నుంచి కోలుకుంటారు.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారు.. సూర్య గ్రహణ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం యోగా చేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
telugu astrology
11.కుంభ రాశి..
ఈ సమయంలో కుంభ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు.. భవిష్యత్తులో ఎంతగానో సహాయపడతాయి.
telugu astrology
12.మీన రాశి..
మీన రాశివారు... వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి. న్యూట్రీషన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.