Solar eclipse 2022: ఈ సూర్యగ్రహణం ఈ నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది..

Published : Apr 29, 2022, 11:28 AM ISTUpdated : Apr 29, 2022, 12:03 PM IST

Solar eclipse 2022: ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30 న ఏర్పడనుంది. అయితే ఇది మన దేశంలో కనిపించదు. కాగా ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ వృషభం, సింహ, వృశ్చిక, కుంభరాశులపై ఎలా ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
18
Solar eclipse 2022: ఈ సూర్యగ్రహణం ఈ నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది..

Solar eclipse 2022: ఏప్రిల్ 30, 2022 న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇదే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం . ఆ తర్వాత మే 16 న మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. 
 

28

హిందూ క్యాలెండర్ ప్రకారం.. సూర్య, చంద్రగ్రహణాలు ఒక సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన వాటిలో ఒకటి. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. 
 

38
Image: Getty Images

హిందు పురాణాల ప్రకారం.. సూర్యగ్రహణం ప్రతి రాశీ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఈ నాలుగు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

48

ఏప్రిల్ 30 న మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ఏర్పడి మే 1న ఉదయం 4.07 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహహణాన్ని దక్షిణ/పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికాలో నివసిస్తున్న ప్రజలు చూడవచ్చు. అయితే ఈ సమయంలో వృషభం, సింహ, వృశ్చిక, కుంభ రాశుల వారు ఏ విధంగా ప్రభావితమవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

58

వృషభం (ఏప్రిల్ 20-మే 20).. ఈ సూర్యగ్రహణం ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇన్ని రోజులు వీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే వీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సూర్యగ్రహణం ఎంతో సహాయపడుతుంది. ఈ సూర్యగ్రహణం మీరు అనుకున్న పనులను చేయడానికి సహాయపడుతుంది. ఇది మీకు కాస్త కష్టంగానే అనిపించినా.. వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడితే మీరనుకున్న కల నెరవేరుతుంది. 

68

సింహం (జూలై 23-ఆగస్టు 22)..  సింహం రాశికి చెందిన వారు.. వారి వృత్తిలో ఒకడుగు ముందుకేస్తారు. వీరు కలలుగన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కొత్త దశలో వీరిపై కొత్త కొత్త బాధ్యతలు మీద పడతాయి. అప్పుడే వీరి అంతర్గత సామర్థ్యం పెరుగుతుంది. సమయానుకూలంగా పనిచేసుకుంటూ పోతే సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. 

78

వృశ్చికం (అక్టోబర్ 23-నవంబర్ 21).. ఈ సూర్యగ్రహణం వృశ్చిక రాశివారికి  కొత్త బంధాలను కలుపుతుంది. ఈ రాశివారికి ఈ సూర్యగ్రహణంతో కొత్త స్నేహితులు పరిచయమవుతారు. మీ పని నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. దీంతో మీరు నలుగురిలో ప్రశంసించబడతారు. మీతో ఎలాంటి వ్యక్తులు ఉండాలో ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం. 

88

కుంభం.. మిమ్మల్ని మీరు ఉన్నత స్థానంలో నిలబెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ సమయంలోనే మీ అసలు శక్తి సామర్థ్యాలు బయటకొస్తాయి. ఇవి మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా ఎదగడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ సమయంలో మీకోసం కొత్త అవకాశాలు ఎదురుచూస్తాయి. ఇవి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి. 

click me!

Recommended Stories