జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. నక్షత్రాలను కూడా మార్చుతూ ఉంటాయి. ఇప్పుడు శని గ్రహం వంతు వచ్చింది. ఈ గ్రహాన్ని...,న్యాయం, కర్మలకు దేవుడుగా పరిగణిస్తారు. శని ఏ రాశిలో ఉన్నా... సుమారు రెండు సంవత్సరాలు ఉంటాడు. శని గ్రహం అన్ని రాశులను పూర్తి చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శని గ్రహం... కుంభ రాశిలో ఉండగా... 2025లో మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. మరో రెండేళ్లు అంటే... 2027 వరకు మీన రాశిలోనే ఉంటాడు. అలా ఉండటం మీన రాశివారికి కష్టాలు తీసుకురాగా... కొన్ని రాశులవారికి మాత్రం ఆర్థికంగా బాగా కలిసి రానుంది. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...