జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు న్యాయం, కర్మ ఫలాలను ఇస్తాడు. శని తన రాశిని మార్చినప్పుడు లేదా తన గమనాన్ని మార్చినప్పుడు, 12 రాశులపై ప్రభావం పడుతుంది. అన్ని గ్రహాల్లో శని అత్యంత నెమ్మదిగా కదులుతుంది. కాబట్టి దాని ప్రభావాలు నెమ్మదిగా, దీర్ఘకాలికంగా ఉంటాయి.
ఈ సంవత్సరం మార్చి 29న శని.. కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. 2027 వరకు శని మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శని గమనంలో కూడా మార్పు కనిపిస్తుంది. జూలైలో శని తిరోగమనంలోకి వెళ్తాడు, సంవత్సరాంతంలో మార్గంలోకి వస్తాడు. శని మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎవరికి లాభం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.