Zodiac sign: మనసులో ఉండేది ఒకటి.. బయటకు చెప్పేది మరోటి...!

Published : Aug 18, 2022, 11:42 AM IST

వారి మనసులో మాత్రం చాలా సీక్రెట్స్ ఉంటాయి. కానీ.. బయటకు అవి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం. ఏ రాశివారు ఎలాంటి విషయాలను మనసులో దాచుకుంటారో ఓసారి  చూద్దాం..

PREV
113
 Zodiac sign: మనసులో ఉండేది ఒకటి.. బయటకు చెప్పేది మరోటి...!

అందరూ పైకి కనిపించినట్లుగా ఏమీ ఉండరు. మనసులో ఒకటి పెట్టుకొని.. బయటకు మరో మాట మాట్లాడేస్తారు. వారి మనసులో మాత్రం చాలా సీక్రెట్స్ ఉంటాయి. కానీ.. బయటకు అవి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం. ఏ రాశివారు ఎలాంటి విషయాలను మనసులో దాచుకుంటారో ఓసారి  చూద్దాం..

213


1.మేష రాశి...
ఈ రాశివారు.. తమ నుంచి ఎవరు దూరమైనా తట్టుకోలేరు. ముఖ్యంగా స్నేహితులు దూరమైతే వీరు అస్సలు భరించలేరు. కానీ... పైకి మాత్రం.. వారు దూరమైనా తాము బాగానే ఉన్నట్లుగా నటించేస్తూ ఉంటారు.

313

2.వృషభ రాశి...
ఈ రాశివారు చూడటానికి చాలా ధైర్యంగా ఉంటారు. కానీ.. తమ వారు తమను తమ వారు ఎప్పుడైనా  వదిలేస్తారేమో అని నిత్యం భయపడిపోతూ ఉంటారు. అందరూ వదిలేసి.. తాము ఒక అపరిచిత వ్యక్తిగా, ఎవరికీ కాని వ్యక్తిగా మిగిలిపోతామేమో అని నిత్యం లోలోపల బయపడుతూనే ఉంటారు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారికి ఒంటరిగా ఉండటం అంటే చాలా భయం. ఈ భయాన్ని బయటపెట్టకుండా నటిస్తారు. కానీ... తాము ఒంటరిగా ఉండకుండా.. ఎప్పుడూ తమ చుట్టూ ఎవరో ఒకరు ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు నిత్యం సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. నిజంగా సంతోషంగా లేకపోయినా... వారు అలా ఉన్నట్లు నటిస్తారు. ఎందుకంటే.. తాము బాధపడుతున్నామని తెలిస్తే.. ఇతరులు కూడా బాధపడతారని వారికి తెలుసు. అది వారికి నచ్చదు. అందుకే... ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు చెరగనివ్వరు.

613

5.సింహ రాశి...
ఈ రాశివారు చాలా సెన్సిటివ్. ఎంతలా అంటే ఒక గ్లాసు అంత సెన్సిటివ్.  అయితే... తమలోని ఈ సైడ్  ని  వీరు బయటకు చూపించాలని అనుకోరు. అందుకే.. అందరికీ చాలా టఫ్ గా ఉన్నట్లు నటిస్తారు.
 

713


6.కన్య రాశి...
ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేసినట్లుగా.. వాటిని మర్చిపోయినట్లుగా వీరు నటిస్తారు. కానీ.. నిజానికి వీరు ఏదైనా సమస్య వస్తే.. దాని నుంచి తొందరగా బయటకు రాలేరు. వీరు అంత తొందరగా పాజిటివ్ గా ఆలోచించలేరు. కానీ.. అలానే ఉన్నట్లు వారు నటిస్తారు.
 

813

7.తుల రాశి..
ఈ రాశివారు తమ జీవితంలో ఎవరైనా ప్రేమించేవారు లేకపోతే చాలా భయపడితూ ఉంటారు. ఎందుకంటే.. వీరు తమ సమస్యలను తామే పరిష్కరించుకోలేరు. ఎవరైనా తోడు ఉంటే బాగుండని అనుకుంటూ ఉంటారు.
 

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తొందరగా ఎవరినీ నమ్మరు. ఒకవేళ నమ్మితే.. వారు మోసం చేసి వెళ్లిపోతారేమో అని వీరికి భయం. అయితే.. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో మాత్రం వీరికి తెలీదు.
 

1013

9.ధనస్సు రాశి..
ఈ  రాశివారు ప్రతి ఒక్కరూ తమను ప్రేమించాలని అనుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఉండటం అంటే వీరికి చాలా భయం. అందుకే ఎవరో ఒకరు తమను ప్రేమించాలని అనుకుంటారు.
 

1113

10.మకర రాశి..
ఇతరులతో పీకల్లోతు ప్రేమలో పడటం వీరికి నచ్చదు. మరీ ఎక్కువగా ప్రేమిస్తే.. వారు దూరమైతే బతకడం కష్టమని వీరికి తెలుసు. అందుకే ముందుగానే ఎవరితోనూ కనెక్షన్ పెట్టుకోరు.

1213

11.కుంభ రాశి..
తమ భాగస్వామి తమను  ఎక్కువగా ప్రేమించకపోతే వీరి మనసు సరిగా ఉండదు. కానీ.. తమ పార్ట్ నర్ తమను ఎలా ప్రేమించుకునేలా చేయాలో మాత్రం వీరికి తెలియదు.

1313

12.మీన రాశి..
వీరికి జీవితంలో ఏం చేయాలి అనే క్లారిటీ అనేది ఉండదు. వీరు ప్రతి విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే.. ఇది మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు.
 

click me!

Recommended Stories