
1.మేష రాశి...
మేష రాశివారు ఎదుటివారు ఏడుస్తుంటే... నవ్వేస్తారు. జోకులు చెప్పి.. ఆ ఏడ్చేవారిని కూడా నవ్వించాలని ఈ రాశివారు ప్రయత్నిస్తారు.
2.వృషభ రాశి..
ఎవరైనా ఏడుస్తుంటే ఆ సమయంలో.... వృషభ రాశివారు చాలా కంఫర్ట్ గా ఉండలేరు. వారు ఏడుస్తున్న వారి దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడరు.
3.మిథున రాశి..
మిథున రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే... వారితో చాలా సూటిగా మాట్లాడతారు. ఏడ్వడం వల్ల... మీ సమస్యలు పరిష్కారమవ్వవు అనే సలహా ఇస్తుంటారు.
4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే.... ఈ రాశివారు కూడా వారితో పాటు కలిసి ఏడ్చేస్తారు. చాలా ఎమోషనల్ అయిపోతారు. వీరికి కూడా అటోమెటిక్ గా ఏడుపు వచ్చేస్తోంది.
5.సింహ రాశి...
సింహ రాశివారు... సాధారణంగానే అటెన్షన్ సీకర్స్. ఎదుటివారు ఏడుస్తుంటే... ఆ సందర్భాన్ని తమకు ఎలా రిలేట్ చేసుకోవాలి..? అందరూ తమను ఎలా ఫోకస్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు.
6.కన్య రాశి..
కన్య రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే...వీరు కూడా ఏడుపు మొహం పెట్టేస్తారు. అంతేకాదు... అయ్యో.. ఏడుస్తుంటే.. డ్రెస్ పాడైపోతుందే.. అని కూడా ఫీలౌతారు.
7.తుల రాశి...
ఎవరైనా ఏడుస్తుంటే... ఈ రాశివారు కూడా చాలా ఎక్కువగా బాధపడతారు. ఏడుస్తున్న వారికి.. మంచినీరు తెచ్చి ఇవ్వడం.. వారిని ఓదార్చడం లాంటివి చేస్తారు.
8.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశివారు ఎదుటివారు ఏడుస్తుంటే... వారిని ఏడుపు ఆపాలని సూచిస్తారు. అందరి ముందు ఏడిస్తే.... అది మీ వీక్ నెస్ అని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి... ఏడుపు ఆపించే ప్రయత్నం చేస్తారు.
9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారు ఎవరైనా ఏడుస్తుంటే...... ఈ రాశివారు చాలా పర్సనల్ గా తీసుకుంటారు. వీరికి ఏడుస్తుంటే చాలా చిరాకు. అందుకే.. ఇంకా వారిని కొట్టడం, బాధ పెట్టడం లాంటివి చేస్తారు.
10.మకర రాశి..
ఎవరైనా ఏడుస్తుంటే... మకర రాశివారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కామ్ గా.. అక్కడి నుంచి పక్కకు తప్పుకోవాలని ఈ రాశివారు చూస్తారు.
11.కుంభ రాశి...
ఎవరైనా ఏడుస్తుంటే కుంభ రాశివారు ప్రశ్నార్థకంగా ముఖం పెడతారు. అసలు ఇప్పుడు వీరు ఎందుకు ఏడుస్తున్నారు అని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటారు.
12.మీన రాశి...
ఈ రాశివారికి ఎవరైనా ఏడుస్తుంటే... వారిని చూడటం కూడా వీరికి నచ్చదు. ఎవరైనా ముఖం బాధగా పెట్టినా వీరు చూడలేరు. వారికి ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.