మీలో దయాగుణం ఎంత? మీ రాశి ఏం చెబుతోంది? చూడండి..

Published : Apr 19, 2022, 01:08 PM IST

కొంతమంది ఎదుటివారికి ఏ చిన్న కష్టం వచ్చినా చూడలేరు. మరికొంతమంది కళ్లముందు చచ్చిపోతున్నా పట్టించుకోరు. దీనికి కారణమేంటి.. వారిలో మానవత్వం ఉండదా? దయాగుణం ఎక్కడికి పోతుంది? అనే ప్రశ్నలకు మీ రాశిచక్రంలోనే సమాధానం ఉందంటున్నారు.. జ్యోతిష్యనిపుణులు.. 

PREV
112
మీలో దయాగుణం ఎంత? మీ రాశి ఏం చెబుతోంది? చూడండి..
Libra

తులారాశి ( Libra)
తులారాశివారు చాలా దయార్ద్ర హృదయులు. ఎదుటి వారితో ఎంతో ప్రేమగా ఉంటారు. ఎవ్వరైనా విషాదంలో ఉంటే వీరు చూడలేరు. తమ వల్ల ఎవరైనా బాధపడతారంటే అస్సలు భరించలేరు. ( Libra)
తులారాశివారు చాలా దయార్ద్ర హృదయులు. ఎదుటి వారితో ఎంతో ప్రేమగా ఉంటారు. ఎవ్వరైనా విషాదంలో ఉంటే వీరు చూడలేరు. తమ వల్ల ఎవరైనా బాధపడతారంటే అస్సలు భరించలేరు.

212
Pisces

మీనరాశి ( Pisces) 
మీనరాశివారు చాలా సున్నిత మనస్కులు. అదే సమయంలో ఊహించలేనంత దయాగుణం వీరి సొంతం. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే వీరందించే సహాయం వెలకట్టలేనిది.

312
Taurus

వృషభరాశి (Taurus) 
వృషభరాశి వారు తమకంటే ఎదుటివారి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఎదుటివారు సౌకర్యవంతంగా ఉండడానికి ఏం చేయాలో వీరికి బాగా తెలుసు. ముందు వారికే ప్రాధాన్యతనిస్తారు.

412
Leo

సింహరాశి (Leo)
సింహరాశివారు గంభీరంగా కనిపించినా చాలా దయామయులు. ఎదుటి వారిపట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. వారిని ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. 

512

కుంభరాశి  (Aquarius)
కుంభరాశివారు పైకి చాలా అంతర్ముఖులుగా కనిపిస్తారు. ఏదో దాస్తున్నట్లుగా, అందరిలో కలవరు అన్నట్టుగా కనిపిస్తారు. కానీ నిజానికి వారు అది కాదు. దయాగుణంలో వీరి మనసు చాలా పెద్దది. 

612

ధనుస్సురాశి  ( Sagittarius)
ధనుస్సురాశివారు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ను వ్యాపింపజేస్తారు. మిగతా వారికి సాయం చేయడం విషయంలో ఎప్పుడూ ముందుంటారు. 

712
Gemini

మిధునరాశి ( Gemini)
మిథునరాశివారు ఎంత దయగా, ప్రేమగా, సాయపడే గుణంతో ఉంటారో... తమకు నచ్చని వాళ్లతో అంతే నిర్దయగా కూడా ఉండగలరు. 

812
(Cancer)

కర్కాటకరాశి ( Cancer) 
మామూలుగా అయితే కర్కాటక రాశివారు దయార్ద్ర హృదయులే. కానీ తరచుగా మారే వీరి మూడ్ వల్ల ఎదుటివారికి ఇబ్బందిగా ఉంటుంది. 

912
Cancer

వృశ్చికరాశి ( Scorpio) 
తమకు ఏదైనా లాభం లేకపోతే వీరు అడుగు కూడా ముందుకు వేయరు. ఎదుటివారికి సాయం చేయాలంటే వీరికి ఏదో ఒక లాభం ఉండాల్సిందే. అది నేరుగా అయినా, ఇండైరెక్టుగా అయినా సరే. 

1012
কন্যা রাশি (Virgo)

కన్యారాశి ( Virgo) 
కొన్నిసార్లు వీరు చాలా కఠినంగా ఉంటారు. దీనివల్ల ఎదుటివారికి రూడ్ గా అనిపిస్తుంది. ఎదుటివారిపట్ల విమర్శనధోరణిలో కూడా ఉంటారు. 

1112
Aries

మేషరాశి (Aries)
మేషరాశి మూడ్ ను బట్టి కొన్నిసార్లు క్రోధంతో.. మరికొన్ని సార్లు రూడ్ గా, ఇంకొన్ని సార్లు స్వార్థంగా ఉంటారు. అది వారు ఆ సమయంలో ఏ మూడ్ లో ఉన్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. 

1212

మకరరాశి ( Capricorn) 
వీరు తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు. అందుకే ఎదుటి వారి గురించి ఆలోచించడం, ఏదైనా సాయం చేయాలనుకోవడం అనేది వారి డిక్షనరీలో ఉండనే ఉండదు. 

click me!

Recommended Stories