జోతిష్యశాస్త్రం ప్రకారం... మీ పిల్లల్లో ఉన్న పాజిటివ్ లక్షణం ఇదే...!

Published : Sep 10, 2022, 01:08 PM IST

ఎంత అల్లరి చేసే పిల్లల్లో అయినా... మనకు తెలియని చాలా పాజిటివ్ లక్షణాలు ఉంటాయట. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఏ రాశి పిల్లల్లో ఏ పాజిటివ్ లక్షణం ఉంటుందో ఓసారి చూద్దాం..

PREV
113
జోతిష్యశాస్త్రం ప్రకారం... మీ పిల్లల్లో ఉన్న పాజిటివ్ లక్షణం ఇదే...!

పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు. ఆ అల్లరి మనకు భరించలేనిదిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే... ఎంత అల్లరి చేసే పిల్లల్లో అయినా... మనకు తెలియని చాలా పాజిటివ్ లక్షణాలు ఉంటాయట. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఏ రాశి పిల్లల్లో ఏ పాజిటివ్ లక్షణం ఉంటుందో ఓసారి చూద్దాం..
 

213

1.మేష రాశి..
ఈ రాశికి చెందిన పిల్లలు లక్ష్యాసాధన విషయంలో ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఈ రాశివారిలో పట్టుదల చాలా ఎక్కువ. అది కూడా మంచి విషయంలోనే వీరికి పట్టుదల ఎక్కువ. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ అనే చెప్పాలి.

313

2.వృషభ రాశి..
వృషభ రాశి వారికి పవర్ ఫుల్ ఓపినియన్స్ కలిగి ఉంటారు. ఈ రాశివారు కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఏదైనా  తమ నిర్ణయాన్ని బయటకు చెప్పడంలో అస్సలు భయపడరు. అది కూడా మంచి నిర్ణయాలను మాత్రమే వారు తీసుకుంటారు. కఠిన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కోవడం ఎలాగో వీరికి బాగా తెలుసు.

413

3.మిథున రాశి..
మిథున రాశికి చెందిన పిల్లలు ఎప్పుడూ బోర్ కొట్టనివ్వరు. ఈ రాశివారు చాలా చక్కగా మాట్లాడగలరు. వారికి నచ్చిన సబ్జెక్ట్ గురించి అనర్గలంగా మాట్లాడగల సత్తా ఈ రాశివారిలో ఉంటుంది.

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన పిల్లలు చాలా దయగల మనస్తత్వం గలవారు. అన్ని రాశులకంటే ఈ రాశి పిల్లలు అందరి పట్ల చాలా జాలి, దయ కలిగి ఉంటారు. అయితే... ఎక్కువగా మనసులో మాటలను మాత్రం తొందరగా బయటపెట్టలేరు. కానీ మాటలతో చెప్పలేని విషయాన్ని చేతలతో చూపించి.. అందరి మనసులు గెలుచుకుంటారు.

613

5.సింహ రాశి..
సింహ రాశికి చెందిన పిల్లలు పుట్టుకతోనే లీడర్స్ లాగా ఉంటారు. వీరి వ్యక్తిత్వం చాలా దృఢంగా ఉంటుంది. ఈ రాశివారిలో ఉన్న ఉత్తమ లక్షణం ఇదే.
 

713

6.కన్య రాశి..
కన్య రాశి పిల్లలు ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోరుకుంటారు. వారు కూడా అలానే ఉంటారు. ప్రతి విషయాన్ని క్షున్నంగా నేర్చుకుంటారు. ఈ రాశి పిల్లలను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

813


7.తుల రాశి..
తుల రాశికి చెందిన పిల్లలు తమ వారి విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఈ రాశి పిల్లలతో మాట్లాడితే ఎవరైనా చాలా కంఫర్ట్ గా ఫీలౌతారు. చాలా తెలివిగలవారు. చాలా నిజాయితీగా ఉంటారు.
 

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశికి చెందిన పిల్లలు చాలా సహజంగా ఉంటారు. వీరిలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. స్వీయ అవగాహన కూడా చాలా ఎక్కువ. అందరి విషయంలోనూ చాలా దయగా ఉంటారు. అలా అని ఈ రాశివారిని ప్రతి విషయంలో గ్రాంటెడ్ గా తీసుకుంటే మాత్రం తట్టుకోలేరు.
 

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశికి చెందిన పిల్లలు చాలా సరదాగా ఉంటారు. ఈ రాశివారు ఛాలెంజెస్ తీసుకోవడానికి ఈ రాశివారు ఎప్పుడూ భయపడరు. ఎప్పుడైనా సరే రిస్క్ తీసుకోవడానికి ఈ రాశివారు ఎప్పుడూ వెనకాడరు.

1113

10.మకర రాశి..
మకరరాశివారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. చాలా తెలివిగలవారు కూడా. వీరు ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోరు. వీరు ఎలాంటి తప్పులు చేయరు.

1213

11.కుంభ రాశి..
కుంభ రాశి పిల్లలు చాలా క్రియేటివ్ గా ఉంటారు. చాలా వ్యహాత్మకంగా ఉంటారు. వీరికి వారిపై ఎలాంటి అనుమానాలు ఉండవు. ఈ రాశి పిల్లలకు చెందిన పిల్లలలకు ది బెస్ట్ క్వాలిటీలు ఉంటాయి.

1313


12.మీన రాశి..
మీన రాశికి చెందిన పిల్లలు చాలా కేరింగ్ గా ఉంటారు. అన్ని విషయాల్లోనూ అందరినీ అర్థం చేసుకుంటారు. ఈ రాశి పిల్లలు ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు.

click me!

Recommended Stories