చీపుర్లు
హిందూ మతంలో.. చీపురును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు దానిని తప్పుడు ప్రదేశంలో పెట్టకూడదు. అలాగే మంచం కింద చీపురును ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం, శాస్త్రాల ప్రకారం.. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. బదులుగా చీపురును ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టొచ్చు. అలాగే వాయవ్య మూలన చీపుర్లను ఉంచడానికి మంచిదని భావిస్తారు. అలాగే చీపురును వంటగది, పడకగది లేదా పూజగది దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా పెడితే మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.