మేషరాశి:- ఈ నెలలో వ్యక్త్రిగత జీవనంలో నూతన వ్యక్తీ వలన తీవ్ర మానసిక ఆందోళన. నిరుద్యోగులకు కూడా ప్రతికూల ఫలితాలు. ఆశించిన ఉద్యోగాలు చేజారిపోవును. నరఘోష వలన ఇబ్బందులు కలవు. మితభాషణం మంచిది. ఈ మాసంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. సంతాన సంబంధ విషయాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చును. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సామాన్య యోగమును కలుగచేయును. ధనాదాయం సామాన్యం. ప్రతీ కార్యం స్వయంగా చేసుకోవడం మంచిది. తగాదలలో సర్దుకుపోవడం ఉత్తమం. నెలాఖరులో ప్రమాదాల నుండి తప్పించుకొందురు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృషభరాశి:- ఈ నెలలో కుటుంబ సంబంధాలు మెరుగవును. విలాసవస్తువుల కొరకు ధనం ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పాత ఋణాలు తీర్చివేస్టారు. ఆర్ధిక లక్ష్యాలు పూర్తిచెయగలరు. విదేశీ ప్రయత్నాలలో విఘ్నాలు కలుగుతాయి. ధనాదాయం వృద్ధి చెందును. జీవిత భాగస్వామితో సఖ్యత - సౌఖ్యం. పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి:- ఈ నెలలో కుటుంబంలో అనుకోని కలహాలకు సూచనలు ఉన్నవి. ద్వితీయ తృతీయ వారములలో అకాల భోజన ప్రాప్తి ఆకారనంగా అనారోగ్యం. చక్కటి ఫలితాలను ఉంటాయి. తలపెట్టిన ప్రతీ ప్రయత్నం విజయవంతం అగును. ధనాదాయం సంతృప్తికరంగా ఉండును. చివరివారంలో చేసిన పనుల ద్వారా మంచి గుర్తింపు లభించును. ఒక నూతన పనియండు నిపుణత సాధించుటకు సూచనలు కలవు. వ్యాపార వ్యవహరాదులు కలసివచ్చును. ఆర్ధిక సంవత్సరం విజయవంతంగా పూర్తీ అగును. ఈ మాసంలో 9, 12, 13 తేదీలు ఆరోగ్య పరంగా మంచివి కాదు. పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది
కర్కాటకరాశి:- ఈ నెలలో జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం ఏర్పడును. అప్రయత్నంగా కొన్ని సమస్యలను కొని తెచ్చుకొందురు. శారీరక శ్రమ పెరుగును. ఈ మాసంలో అతి ధైర్యంతో ఆలోచనలు చేయకుండా ఉండుట మంచిది. మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ధనాదాయం బాగుండును. మానసిక ప్రశాంతత కోరవడును. మనోధైర్యాన్ని కోల్పోవు సంఘటనలు ఏర్పడు సూచన. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగునట్టు వ్యవహరించుట అవసరమగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుట మంచిది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి :-ఈ నెలలో కుటుంబ సభ్యుల మారిన వ్యక్తిత్వాలు సంతృప్తిని కలుగచేయును. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి ఏర్పడును. కుటుంబ సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా కాలం గడుస్తుంది. బంధు మిత్రుల సమాగమము ఏర్పడును. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.
కన్యారాశి :- ఈ నెలలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. ఈ మాసంలో 19 వ తేదీ నుండి 27 వ తేదీ మధ్య కాలం చక్కటి అనుకూలమైన కాలం. గృహ సంబంధ నిర్మాణ పనులకు , వ్యాపార విస్తరణకు చక్కటి కాలం. రావలసిన ధనం చేతికి వచ్చును. ధనాదాయం వృద్ధి చెందును. ఉద్యోగంలో చక్కటి గౌరవ పురస్కారాలు లభించును. ఈ మాసంలో అన్ని విషయాలలో పూర్తీ అనుకూలత ఏర్పడును. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులరాశి :- ఈ నెలలో ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతో జాగ్రత్త అవసరం. నూతన రుణాలకు ప్రత్నించకుండా ఉండుట మంచిది. ఆర్ధికంగా అనుకూల ఫలితాలను, ఆరోగ్య పరంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు. సంతాన సంబంధ విషయాలు బాధ కలిగించు సూచన. సంతాన ఆరోగ్యం ఆందోళన కలిగించుటకు అవకాశం కలదు. ధనాదాయం బాగుండును. రెండవ వారంలో కుటుంబ పరిస్థితులు గతి తప్పును. తృతీయ వారం ఉద్యోగ మార్పులకు, ఇంటర్వులకు అనుకూలమైన కాలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.
వృశ్చికరాశి :- ఈ నెలలో ఉన్నత పదవులు పొందటానికి ఇది యోగావంతమైన కాలం. నూతన పారితోషకాలు అందుకోను సూచనలున్నాయి. ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పుర్తిచేయవలసిన పరిస్థితులు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం. నూతన ప్రయోగాలు చేయుటకు ఇది మంచి కాలం. చివరివారంలో ఆరోగ్య సమస్య లేదా శస్త్ర చికిత్స జరుగు అవకాశం కలదు.పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.
ధనస్సురాశి :- ఈ నెలలో వ్యక్తిగత జీవితంలో మానసిక అశాంతి. భాద్యతలను నేరవేర్చకపోవుట వలన ఉద్యోగ జీవనంలో సమస్యలు. ఏలినాటి శని ప్రభావం వలన సొంత మనుష్యలతో విరోధాలు, శారీరక బాధలు, అవాంచిత కలహాలకు సూచనలు కలవు. ధనాదాయం సామాన్యం. వృత్తి జీవనంలోని వారికి ఆదాయం ఆశించినంతగా ఉండదు. లాటరీలు లేదా స్పెక్యులేషన్ వలన నష్టములు. పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి :- ఈ నెలలో జీవిత భాగస్వామి మీ అవసరాలను గమనించి తగువిధంగా నడుచుకొందురు. సంతానం కోసం ప్రయత్నాలు చేయువారికి శుభవార్తలు. ధనాదాయం బాగుండును. ఉద్యోగ జీవనంలో మానసిక ఒత్తిడి అధికమగు సూచనలు కలవు. ప్రతీ విషయంలోనూ సందేహాలు ఎదురగు అవకాశం కలదు. వ్యాపార రంగంలోని వారికి అధికారుల వలన సమస్యలు. వ్యక్తిగత జీవనం మాత్రం బాగుంటుంది. గృహ నిర్మాణ సంబంధ బ్యాంకు రుణాలు లభిస్తాయి. సొంత గృహం కల నెరవేరుతుంది. ఈ మాసంలో 13 వ తేదీ నుండి 20 వ తేదీ మధ్య చేయు ప్రయాణములందు జాగ్రత్త అవసరం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి :- ఈ నెలలో పుకార్లచే సమస్యలు పెరిగిననూ ధ్యైర్యంగా ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయగలరు.అవివాహితులకు యోగం తక్కువ.సంతానంపై అధిక శ్రద్ధ చూపండి. రాజీ ప్రయత్నాలు నెరవేరుతాయి. ధనాదాయం సామాన్యం. ఎదిగిన సంతానము వలన సమాజంలో గౌరవ హాని. పంతాలకు పోవుట వలన ఇబ్బందులు. గత మాసపు సమస్యలు కొనసాగును. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. వైద్య సలహాలు స్వీకరించుట ఉత్తమం. పశు, పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి :- ఈ నెలలో తలపెట్టిన ప్రతీ కార్యం, ఆలోచన లాభించును. గతకాలపు సమస్యలు తొలగును. కార్య సిద్ధి, ఆర్ధిక అభివృద్ధి ఏర్పడును. వృధా ధనవ్యయం తగ్గును. చేతిపై ధనం నిలుచును. శారీరక స్వస్థత ఏర్పడును. గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్థి లాభం ఏర్పడును. వివాదాలు తొలగిపోవును. అరుదైన అవకాశములు లభించును. శుభవార్తలు వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరచును. 24 వ తేదీ నుండి 29 వ తేదీ మధ్య కాలంలో స్త్రీలకు గర్భ లేదా ఉదర సంబంధ సమస్యలున్నాయి. పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.