telugu astrology
మేషం:
ఈ వారం ప్రేమలో పడే ఈ రాశి వారు తమ ప్రేమికుడు-ప్రియురాలు పట్ల తమ ప్రేమను చూపించడానికి వీలైనదంతా చేస్తారు. మీరు వారికి తగినంత సమయం ఇవ్వడం లేదని మీ భాగస్వామి భావిస్తారు. దీంతో వారికోసం మీరు తగిన సమయాన్ని వెచ్చిస్తారు. ఇది మీ భాగస్వామికి బాగా నచ్చుతుంది. మీ ప్రేమ దారం బలంగా ఉంటుంది. పెళ్లి సమయంలో చేసిన వాగ్దానాలన్నీ నిజమని మీరు భావించే ఈ వారం మీతో చాలా సంఘటనలు జరుగుతాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన స్నేహితుడు అని మీరు కనుగొంటారు.
telugu astrology
వృషభం:
ప్రేమ సహచరుడితో గడపడం వల్ల మీరు ఈ వారం జీవితంలోని ఇబ్బందులన్నింటినీ మర్చిపోతారు. ఈ వారం మీ భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు.వ అలాగే మీకు అనుకూలంగా వ్యవహరిస్తాడు. మీరు అతన్ని చాలా కాలంగా కలవకపోతే ఈ సమయంలో కలుస్తారు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మీరు మీ భాగస్వామితో మధురమైన క్షణాలను గడుపుతారు. మీ పట్ల, కుటుంబం పట్ల జీవిత భాగస్వామి మంచి ప్రవర్తనను చూసి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
telugu astrology
మిథునం:
ఈ వారం మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు అతనికి ఒక మొక్కను బహుమతిగా ఇస్తారు. దీంతో మీ ఇద్దరి మధ్య వచ్చే ప్రతి దూరం ముగుస్తుంది. అలాగే ఆ మొక్క ఎలా వృద్ధి చెందుతుందో మీ అనుబంధం కూడా అలాగే పెరుగుతుంది. మీ వివాహానికి ముందు ఉన్న ప్రేమికుడు ఈ వారం మీ జీవితంలోకి తిరిగి రావొచ్చు. అయితే అతన్ని చూడగానే మీరు ఒకప్పటిలా కాకుండా కొంత అసౌకర్యానికి గురవుతారు.
telugu astrology
కర్కాటక రాశి:
ఈ వారం మీరు మీ ప్రియమైన వ్యక్తిని చాలా మిస్ అవుతారు. కానీ అతను పనిలో బిజీగా ఉండటం వల్ల వారిని మీరు కలవలేరు. ఈ కారణంగా మీరు కొంత వరకు ఒంటరిగా ఫీలవుతారు. ఈ వారం మీ వైవాహిక జీవితం గడ్డు దశలో ఉన్నట్టు అనిపించొచ్చు. అయినప్పటికీ మీ భాగస్వామితో ప్రతి వివాదాన్ని పరిష్కరించండి.
telugu astrology
సింహ రాశి:
మీ ప్రియమైన వ్యక్తికి మీకు మధ్య సంబంధం మెరుగుపడుతుంది. మీరు మీ పవిత్ర సంబంధంలో వచ్చే అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. ఇది మీ ప్రేమికుడితో అందమైన సమయాన్ని గడపడానికి కూడా మీకు అవకాశం ఇస్తుంది. ఈ వారం మీ వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక సుందరమైన విషయాలు మీ ముందుకు వచ్చినప్పుడు, మీరు భావోద్వేగానికి గురికాకుండా ఉండలేరు. దీన్ని చూసినప్పుడు, మీ భాగస్వామి కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు ప్రతి సాయంత్రం మీ భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు.
telugu astrology
కన్య:
ఈ వారంలో గ్రహాల అనుకూల కలయిక వల్ల చివరిలో ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ వారం మీకు చాలా మంచిది. మీ ప్రేమ జీవితం ప్రేమతో ముందుకు సాగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ అందమైన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశి వివాహితులకు ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మొత్తం మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. దీని కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
telugu astrology
తుల:
మొదటి, ఎనిమిదవ ఇంటికి అధిపతిగా శుక్రుడు మీ తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. ఈ సమయంలో మీరు మీ ప్రేమికుడికి అన్ని విషయాలు చెప్తారు. ఇది వారిని ఎంతో సంతోషపరుస్తుంది. మీరిద్దరూ అందమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైనా ప్లాన్ వేసే ముందు వారికి సమయం ఉందా? లేదా? అని తెలుసుకోండి. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈ రాశి వారు తమ భాగస్వామితో కలిసి అందమైన ప్లేస్ కు వెళతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది.
telugu astrology
వృశ్చికం:
మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే.. ఈ వారం మీ ప్రేమ జీవితంలో చాలా మంచి ఫలితాలు పొందుతారు. లగ్నానికి అధిపతిగా శుక్రుడు మీ మూడవ ఇంట్లో ఉన్నందున మీ ప్రేమ జీవితం వర్ధిల్లుతుంది. అలాగే మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్టైతే మీరు కుటుంబ సభ్యుల సహాయంతో ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశాన్ని పొందేుచ్చు. ఈ రాశికి చెందిన వివాహితుల జీవితం ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం మీ ఇద్దరినీ ఒకరికొకరు దగ్గర చేస్తుంది. మీ పిల్లల వైపు నుంచి ఏదో ఒక రకమైన శుభవార్తను అందుకుంటారు. అందజేస్తుంది.
telugu astrology
ధనుస్సు:
ఆరవ, పదకొండవ ఇంటికి అధిపతిగా శుక్రుడు మీ ఏడవ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమలో ఉన్న ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం తమ ప్రేమ భాగస్వామితో శృంగార సమయాన్ని గడపడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో మీ మనస్సులోని మాటలను చెప్తారు. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది.ఇప్పటి వరకు మీరు పెళ్లి అంటే ఒప్పందాలు మాత్రమే అని అనుకుంటే.. ఈ వారం మీరు అది తప్పు అని తెలుసుకుంటారు.
telugu astrology
మకరం:
ఈ వారం మీ ప్రియమైన వ్యక్తి మీ నుంచి చాలా కోరుకోవచ్చు. దీని గురించి ఆలోచిస్తూ మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వారి డిమాండ్లను పక్కన పెట్టి వారితో కూర్చొని మాట్లాడండి. ఈ వారం మీ పట్ల మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఈ కారణంగా మీకు వారితో విభేదాలు రావొచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు సహనంతో ఉండాలి.
telugu astrology
కుంభ రాశి:
మీ ప్రేమికుడిని సంతోషపెట్టడానికి మీరు మీ ఇష్టానికి విరుద్ధంగా చాలా పనులు చేస్తారు. ప్రేమ సంబంధంలో బానిసలా ప్రవర్తించకూడదు. ఈ వారం మీ వైవాహిక జీవితానికి సంబంధించి మీ మనస్సులో కొంత అనిశ్చితి ఉంటుంది. దీనివల్ల మీరు మీ వైవాహిక జీవితంలో చిక్కుకున్నట్టు భావిస్తారు. అందుకే మీ మనసులో తలెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానాలు పొందడానికి మీ భాగస్వామితో మాట్లాడండి.
telugu astrology
మీనం:
ప్రేమ జీవితంలో ఒకరికొకరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీ భాగస్వామి మీ ముందు తన మనసులోని మాటను చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది పడరు. దీనివల్ల మీరు మీరు అతని జీవితానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోగలుగుతారు. దీంతో మీరు చాలా ఆశ్చరానికి గురవుతారు.