ఈ రాశివారు పరమ బద్దకస్తులు..!

Published : Sep 08, 2021, 12:13 PM IST

బద్దకం ఎక్కువై..వారు అలా పనులు  చేయకుండా తప్పించుకు తిరుగుతుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశులవారు ఎక్కువ బద్దకస్తులో ఇప్పుడు చూద్దాం..  

PREV
113
ఈ రాశివారు పరమ బద్దకస్తులు..!

కొందరు తమ శక్తిని మించి కష్టపడుతుంటారు.  కానీ కొందరు మాత్రం చేయాల్సిన పని కళ్ల ముందే కనపడుతున్నా.. చేయకుండా తప్పించుకు తిరుగుతుంటారు.  దానినే సోమరితనం అంటూ ఉంటారు.  బద్దకం ఎక్కువై..వారు అలా పనులు  చేయకుండా తప్పించుకు తిరుగుతుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశులవారు ఎక్కువ బద్దకస్తులో ఇప్పుడు చూద్దాం..

213

1. ధనస్సు రాశి..

ఈ రాశివారు ఎక్కువగా స్వేచ్ఛ కోరుకుంటారు. అయితే.. ఆ స్వేచ్ఛ పై వీరికి నియంత్రణ తక్కువగా ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేయమంటే వీరి వల్ల కాదు. పూర్తిగా సోమరితనం అని కాదు కానీ.. వారు.. రూల్స్ ప్రకారం పనిచేయమంటే ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే.. ఈ జాబితాలో వీరు ముందు స్థానంలో ఉన్నారు.

313

2. కుంభ రాశి..
ఈ రాశివారు చాలా తెలివిగలవారు. ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే.. యాక్టివ్ గా లేని పనులు చేయడానికి ఈ రాశివారు పెద్దగా ఇష్టపడరు. ఎదైనా ఉత్సాహంగా ఉండే పనిని చేయాలని కోరుకుంటారు. అలాంటి లేని పనులు ఇస్తే మాత్రం వీరు వాటిని తప్పించుకొని తిరగాలనే చూస్తుంటారు.

413

3.వృషభ రాశి..

ఈ రాశివారు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. గడియారం ప్రకారం పనిచేయడం  వీరికి సాధ్యం కాదు.  అన్ని కంఫర్ట్స్ ఉంటేనే పని చేయాలని అనుకుంటారు. అలా సౌకర్యవంతంగా లేకపోతే.. వీరు పనిచేయలేరు.
 

513

4.సింహ రాశి..
వీరు ఎక్కడ ఉన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా గుర్తింపు పొందుతారు. అయితే.. తమ కింద పనిచేసే వారిని మాత్రం చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారిని తక్కువగా అంచనా వేస్తుంటారు. తన వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. తమలో ఉన్న సోమరితనాన్నిఅంగీకరించారు.

613

5.మీన రాశి..

ఈ రాశివారు.. ఎక్కువగా ఊహల్లో బతికేస్తుంటారు. ఊహల్లోనే అందరిపైనా ఆధిపత్యం చెలాయిస్తారు. నిజ జీవితంలోకి వచ్చే సరికి.. చేయాల్సిన పని మీద దృష్టి కూడా పెట్టలేరు. ఫలితంగా పని తప్పించుకుంటూ తిరుగుతుంటారు.
 

713

6.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తారు. కర్కాటక రాశివారు బద్దకస్తులు కాదు కానీ.. తొందరగా పని పూర్తి చేయలేరు. చాలా నెమ్మదిగా పనిచేస్తుంటారు.  ఈ క్రమంలో అందరూ వీరిని సోమరిపోతూ అంటూ ఉంటారు. ఈ సోమరితనం ముద్ర వీరిపై పడుతుంది.

813


7.తుల రాశి..
తుల రాశి వారు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వాళ్లకు చేయాలి అనిపించినప్పుడు ఎంత పనైనా చిటికెలో పూర్తి చేయగలరు. ఒక్కోసారి మాత్రం.. అస్సలు  పని చేయకుండా మొండిగా ప్రవర్తిస్తారు.

913

8.మిథున రాశి..
ఈ రాశివారు చాలా టాకిటివ్. ఎక్కువగా  మాట్లాడుతూ ఉంటారు. అయితే.. కొంచెం సోమరితనం ఉంటుంది. మాటలు చెబుతూ పని చేయకుండా తప్పించుకుంటారు. ఎక్కువగా కష్టం ఉండని ఉద్యోగం దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు.

1013

9.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తమ జీవితంలో చాలా ఎమోషనల్. ఈ క్రమంలో.. ఆ ఎఫెక్ట్ వారి ఉద్యోగ జీవితంపై కూడా పడుతుంది. మనసులో ఇంట్లో ఉన్న బాధలను తలుచుకుంటూ.. పని చేయకుండా ఆలోచిస్తూ కూర్చుుంటారు. ఈ క్రమంలో.. వీరిని అందరూ సోమరిపోతులుగా అనుకుంటూ ఉంటారు.

1113

10.మేష రాశి..
ఈ రాశివారికి బద్దకం అంటే ఏంటో కూడా తెలీదు. పని వాయిదా వేయడం అంటే ఏంటో వీరికి అస్సలు తెలీదు. అన్నింట్లోనూ వీరు ముందుంటారు. ప్రతి విషయంలోనూ ముందుండాలని వీరు కోరుకుంటారు.

1213

11.మకర రాశి..
బద్దకం అంటే ఏంటో ఈ రాశివారికి అస్సలు తెలీదు. బద్దకం అనేది వీరి డిక్షనరీలోనే ఉండదు.  అన్ని పనుల్లోనూ చాలా చురుకుగా ఉంటారు. వీరి జీవితంలో సోమరితనం అనేది చాలా అరుదు.

1313


12. కన్య రాశి..

ఎవరికైనా అప్పుడో ఇప్పుడో బద్దకం అనేది ఉంటుుంది కానీ.. ఈ రాశివారి జీవితంలో బద్దకానికి చోటు లేదు.  ఎవరు ఏ పని అప్పగించినా.. లేదు.. కాదు అనే పదాలు వాడకకుండా చేస్తూనే ఉంటారు. పని చేయడం వీరికి నచ్చిన పని.
 

click me!

Recommended Stories