మీ జేబులో ఈ మూడు ఉంటే... అన్నింట్లోనూ విజయం మీదే..!

First Published | Apr 17, 2024, 4:15 PM IST

కొన్ని వస్తువులను జేబులో ఉంచుకోవడం వల్ల  మీరు వెళ్లిన పని కచ్చితంగా జరుగుతుంది. మరి ఏవి జేబులో పెట్టుకుంటే శుభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం దక్కాలని చాలా మంది కోరుకుంటారు. కానీ.. అది అందరికీ సాధ్యాం కాకపోవచ్చు. కొందరికి అయితే.. ఎంత కష్టపడినా కూడా ఫలితం రాదు. ఏ పని చేసినా నిరాశే మిగులుతూ ఉంటుంది. వారికి ప్రతి పనిలోనూ ఫెయిల్ అవుతూ ఉంటే.. ఎవరికైనా నిరాశ కలుగుతుంది. అయితే.. అలా ప్రతిసారీ ఫెయిల్ అవుతూ ఉన్నామంటే.. దానికి గ్రహాలు కూడా కారణం అవ్వచ్చు. 

గ్రహాలు సరిగాలేకపోతే..మనం ఏ పని చేసినా ఫలితం రాకపోవచ్చు. అలాంటి సమయంలో.. మనం ఏదైనా పనిమీద బయటకు వెళ్లే సమయంలో ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు  కొన్ని వస్తువులను జేబులో ఉంచుకోవడం వల్ల  మీరు వెళ్లిన పని కచ్చితంగా జరుగుతుంది. మరి ఏవి జేబులో పెట్టుకుంటే శుభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 


camphor

1. కర్పూరం.. మనం దాదాపు పూజ దగ్గర వాడుతూ ఉంటాం. ముఖ్యంగా హారతి ఇవ్వడానికి వాడతాం. కానీ.. అదే కర్పూరం మనకు విజయాన్ని అందిస్తుందని మీకు తెలుసా? మీరు బయటకు వెళ్లే సమయలంో  కర్పూరం జేబులో ఉంచుకుంటే చాలు. కర్పూరం ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూలతను పెంచుతుంది. ఇది కాకుండా, కర్పూరం శుక్ర గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, కర్పూరాన్ని జేబులో ఉంచుకోవడం వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలపడుతుంది. పనిలో విజయం కూడా వస్తుంది. కాబట్టి.. ఒకసారి ప్రయత్నించి చూడండి.

2.బిర్యానీ ఆకు..

జ్యోతిషశాస్త్రంలో బిర్యానీ ఆకు  చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. బిర్యానీ ఆకు రాహువుకు సంబంధించినది. అదే సమయంలో, రాహువు పనిలో అడ్డంకులను సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ జేబులో బిర్యానీ ఆకులను ఉంచుకోవడం వల్ల రాహువు  చెడు ప్రభావాలు తగ్గుతాయి. ఇది కాకుండా, మార్గంలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. శుభ ఫలితాలుు అందుకుంటారు.

3. అగ్గి పుల్లలు..

మీరు నమ్మకపోయినా జోతిష్యశాస్త్రం ప్రకారం  అగ్గి పుల్లను కూడా  శుభ్రప్రదంగా భావిస్తారు. అందుకే మీరు బయటకు వెళ్లే సమయంలో.. కచ్చితంగా జేబులో అగ్గి పుల్లను ఉంచుకోవాలి.  అగ్గి పుల్లను జేబులో పెట్టుకోవడం వల్ల.. ప్రతి కూలత తగ్గుతుంది.  మీ చుట్టూ ఏదైనా దుష్ట శక్తులు ఉంటే..  ఆ అగ్గి పుల్లను ఉంచడం వల్ల.. వాటిని దూరం చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది. కాబట్టి.. ఒకసారి ప్రయత్నించి చూడండి. 

Latest Videos

click me!