కాలాష్టమి నాడు శివుడిని రాశిచక్రం ప్రకారం ఎలా పూజించాలంటే?

Published : Dec 05, 2023, 09:47 AM IST

Kalashtami 2023: కాలభైరవుడిని పూజించడం వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి.. కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం ఉంది. ఈ రోజు కాలభైరవ జయంతి. కాబట్టి ఈ రోజు రాశిచక్రం ప్రకారం.. శివుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
కాలాష్టమి నాడు శివుడిని రాశిచక్రం ప్రకారం ఎలా పూజించాలంటే?

Kalashtami 2023: సనాతన పంచాంగం ప్రకారం డిసెంబర్ 5 నే అంటే ఈ రోజే కాలభైరవ జయంతి. ఈ పండుగను ప్రతి ఏడాది మార్గశిర్ష మాసంలోని కృష్ణ పక్షం అష్టమి నాడు జరుపుకుంటారు. మార్గశిర్ష మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శివుడు కాలభైరవ అవతారం ఎత్తాడని సనాతన గ్రంధాల్లో చెప్పబడింది. అందుకే కాలభైరవ జయంతిని ప్రతి ఏడాది మార్గశిర్ష మాసంలో జరుపుకుంటారు. కాల భైరవుడిని పూజించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం ఉంది. అలాగే మీ జీవితంలోని అన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీరు కూడా కోరుకున్న వరం పొందాలనుకుంటే.. కాల భైరవ జయంతి నాడు రాశిచక్రం ప్రకారం శివుడికి అభిషేకం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25

మేషరాశి: కాలభైరవ జయంతి నాడు మేషరాశి వారు ఉదయాన్నే స్నానం చేసి ధ్యానం చేసి శివుడికి పూజ చేయాలి. పూజా సమయంలో గంగా నీటిలో తేనె, సుగంధం కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల మంగళదోశం తొలగిపోతుంది.

వృషభ రాశి: ఈ రాశివారు కాలాష్టమి తిథి నాడు శివుడిని పూజించడం వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు. వీళ్లు ఈ రోజు శివుడికి పచ్చి పాలతో అభిషేకం చేయాలి.

మిథునరాశి: అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అలాగే జాతకంలో బుధ గ్రహాన్ని బలోపేతం చేయడానికి మిథున రాశి వారు గంగా నీటిలో దుర్వ, బిల్వపత్రాన్ని కలిపి శివుడికి అభిషేకం చేయాలి.

35


కర్కాటక రాశి:  కర్కాటక రాశివారు మహాదేవుని అనుగ్రహం పొందడానికి శివుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల బంధం బలపడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. 

సింహరాశి: కాలభైరవ జయంతి సందర్భంగా సింహ రాశి వారు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయాలి. దీనివల్ల మీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. 

కన్యరాశి: కన్యరాశి వారు కాలాష్టమి నాడు గంగాజలం లేదా పచ్చి పాలలో బిల్వపత్ర, దుర్వా కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఈ పరిహారం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
 

45


తులారాశి: శివుని అనుగ్రహం పొందడానికి తులారాశి వారు కాల భైరవ జయంతి నాడు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి. స్వచ్ఛమైన నెయ్యితో కూడా అభిషేకం చేయొచ్చు. 

వృశ్చిక రాశి : శివుని అనుగ్రహం పొందడానికి వృశ్చిక రాశి వారు స్వచ్ఛమైన నీళ్లు లేదా గంగా నీటిలో తేనె, సుగంధాన్ని కలిపి మహాదేవుడిని అభిషేకం చేయాలి.

ధనుస్సు రాశి: ఈ రాశిచక్రం వాళ్లు కాలాష్టమి నాడు పాలలో కుంకుమ పువ్వును కలిపి శివుడిని పూజించాలి. ఈ పరిహారాన్ని చేయడం మీ జాతకంలో బృహస్పతి బలంగా మారతాడు.
 

55

మకర రాశి: కాలాష్టమి నాడు మకర రాశి వారు నల్ల నువ్వులను నీటిలో కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఈ పరిహారం వల్ల మీపై అశుభ గ్రహాల ప్రభావం తగ్గుతుంది.

కుంభ రాశి: ఈ రాశివాకె దేవుళ్లకు దేవుడైన మహాదేవుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

మీనరాశి: కాలాష్టమి నాడు మీన రాశి వాళ్లు గంగా నీటిలో కుంకుమ పువ్వును కలిపి మహాదేవుడికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, ఐశ్వర్యం మీకు లభిస్తాయి.
 

click me!

Recommended Stories