Today Horoscope: ఓ రాశివారికి కొత్త విషయాలు తెలుస్తాయి

Published : Dec 05, 2023, 04:30 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఇతరులతో వాదోపవాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగి పోగలవు.

PREV
113
Today Horoscope: ఓ రాశివారికి  కొత్త విషయాలు తెలుస్తాయి

05-12-2023, మంగళవారం    మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు  మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.

213
telugu astrology

      

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (సంపత్తార)
భరణి నక్షత్రం వారికి  (జన్మతార)
కృత్తిక నక్షత్రం వారికి  (పరమైత్రతార)

దిన ఫలం:-ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధు మిత్రులతో కలహాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరులతో వాదోపవాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలపెట్టిన పనులు మధ్యలో ఆగి పోగలవు.

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (పరమైత్రతార)
రోహిణి నక్షత్రం వారికి  (మిత్ర తార)
మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-పనులు వాయిదా పడతాయి. విద్యార్థుల శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది . ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చుల నియంత్రణ చేయాలి.మానసిక ఆందోళన చికాకులు.శారీరక శ్రమ పెరుగుతుంది .కోపం అధికంగా ఉండును.అపవాదము లు రాగలవు .

413
telugu astrology

     

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి  (నైధనతార)
ఆరుద్ర నక్షత్రం వారికి (సాధన తార)
పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-అధికారులు తో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు లో ఏమరుపాటుగా ఉండకూడదు . భాగస్వాములతో మనస్పర్థలు రావొచ్చు.అనవసరమైన చర్చలు కు దూరంగా ఉండాలి.స్నేహితుల వల్ల ఆర్థిక విషయాలు లో చికాకులు తలెత్తవచ్చు.పనిచేసే చోట వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగుతుంది. చేసే పని లో కోపం అధికంగా ఉండును.అపవాదము లు రాగలవు .

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
పుష్యమి నక్షత్రం వారికి  (క్షేమతార)
ఆశ్రేష నక్షత్రం వారికి   (విపత్తార)

దిన ఫలం:-అన్ని విషయాల్లో సహనం ఓర్పు అవసరం. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రాగలవు. తలపెట్టిన పనులు లో ఇతరుల సహాయం సలహాలు తీసుకోవాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలు కు దూరంగా ఉండాలి.
 

613
telugu astrology


  
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి  (సంపత్తార)
పూ.ఫ నక్షత్రం వారికి ఈ రోజు (జన్మతార)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  ఈ రోజు(పరమైత్రతార)

దిన ఫలం:-గొప్పవారి తో పరిచయం కలుగును.స్త్రీ మూలకంగా లాభం . మంచి ఆలోచనలు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సమాజంలో సత్కారాలు  పొందగలరు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది . ప్రయత్న కార్యంలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులను కలుస్తారు.కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
 

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు:-(టో-పా-పీ-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (పరమైత్రతార)
హస్త నక్షత్రం వారికి  (మిత్ర తార)
చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్థలు రాగలవు .ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన  పనుల్లో ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచన కలుగును . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి . విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఓం కుమారాయ నమః  జపించండి. శుభ ఫలితాలను పొందండి.
 

813
telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
చిత్త నక్షత్రం వారికి  (నైధనతార)
స్వాతి నక్షత్రం వారికి (సాధన తార)
విశాఖ  నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అభిమానం పొందగలరు.  చేపట్టిన పనులు  విజయంగా పూర్తి కాగలవు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది .

913
telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)
అనూరాధ నక్షత్రం వారికి  (క్షేమతార)
జ్యేష్ట నక్షత్రం వారికి  (విపత్తార)

దిన ఫలం:-అన్ని వర్గాల వారు అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందం పొందుతారు.వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది.తలపెట్టిన కార్యాలలో మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి కాగలవు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన అభివృద్ధి ఆలోచనలు ఇతరులతో చర్చిస్తారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.

1013
telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి  (సంపత్తార)
పూ.షా  నక్షత్రం వారికి  (జన్మతార)
ఉషా     నక్షత్రం వారికి  (పరమైత్రతార)

దిన ఫలం:-కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయి. సంతోషంగా గడుపుతారు.వాయిదా వేసిన పనులన్నీ పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలు గ్రహిస్తారు.మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులు తో పరిచయాలు ఆనందం కలిగించును. నూతన విషయాల గురించి అన్వేషణ మొదలు పెడతారు.

1113
telugu astrology


మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
తారాబలం
ఉ. షా నక్షత్రం వారికి  (పరమైత్రతార)
శ్రవణా నక్షత్రం వారికి  (మిత్ర తార)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార)

దిన ఫలం:-బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు .విద్యార్థులు చదువులో  రాణిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. మిత్రుల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు.ఆర్థిక మరియు కుటుంబ విషయాలు లో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.

1213
telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు:-(గూ-గే-గో-సా-సీ-సూ-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రం వారికి  (నైధనతార)
శతభిషం నక్షత్రం వారికి  (సాధన తార)
పూ.భా నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)

దిన ఫలం:-విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు . గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది.  ప్రయత్నించే పనులు లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు చేరుకుంటారు.
 

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు:-(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి (ప్రత్యక్తార)
ఉ.భా  నక్షత్రం వారికి (క్షేమతార)
రేవతి నక్షత్రం వారికి(విపత్తార)

దిన ఫలం:-అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.  కుటుంబ సభ్యులతో అకారణ మాట పట్టింపులు రాగలవు.సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. ఇరుగుపొరుగు సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి.అనవసరమైన చర్చలు కు దూరంగా ఉండాలి.

click me!

Recommended Stories