Jupiter Transit: గురు గ్రహ ప్రత్యక్ష సంచారం..ఈ రాశులకు అదృష్ట యోగం..!

Published : Mar 02, 2026, 05:51 PM IST

Jupiter Transit: ప్రస్తుతం గురు గ్రహం తిరోగమన స్థితిలో ఉన్నాడు. మార్చి11న ప్రతక్షంగా అంటే నేరుగా కదలనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల అదృష్టం రెట్టింపు కానుంది. 

PREV
15
1.మేష రాశి...

గురు గ్రహ ప్రత్యక్ష సంచారం మేష రాశివారికి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ సమయంలో చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఈ సమయంలో, పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తి అవుతాయి. మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు.. ఆర్థికంగా కూడా గొప్ప స్థాయికి వెళతారు.

25
2.మిథున రాశి...

గురు గ్రహ ప్రత్యక్ష ప్రచారం మిథున రాశివారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ సమయంలో ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి.మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడితే, గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు మంచి డీల్స్ వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది.

35
సింహ రాశి...

గురు గ్రహ ప్రత్యక్ష సంచారం సింహ రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులు విజయాలు అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.అప్పుల బాధ కూడా తీరుతుంది.

45
తుల రాశి...

గురు గ్రహ సంచారం తుల రాశివారికి అనేక ప్రయోజనాలు తెస్తుంది.ఏదైనా ఆస్తి కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే.. అవి తొలగిపోతాయి. మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆనందం రెట్టింపు అవుతుంది

55
ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి గురు గ్రహ సంచారం చాలా అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో మీ పని వేగవంతమౌతుంది. చేయాలి అనుకున్న పనులు పూర్తి అవుతాయి.మీ అదృష్టం కూడా పెరుగుతుంది. తీర్థయాత్రాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మార్చి 11 తర్వాత ఈ రాశివారు ఏం చేసినా అనుకూలంగా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories