Jupiter Effect: భూమికి దగ్గరగా వచ్చిన గురుగ్రహం.. ఈ 4 రాశుల వారికి రాసిపెట్టిన ధనయోగం

Published : Jan 11, 2026, 06:30 AM IST

Jupiter Effect: నవగ్రహాలలో బృహస్పతి ముఖ్యమైన గ్రహం.  దేవగురువుగా చెప్పుకుంటారు.  జనవరి 10, 2026 రాత్రి ఆకాశంలో బృహస్పతి స్థానం చాలా ప్రత్యేకంగా  మారబోతోంది. గురుగ్రహం భూమికి చాలా దగ్గరగా వస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. 

PREV
14
మేషరాశి

బృహస్పతి అనుగ్రహం ఉంటే చాలు ఆ రాశి వారు లక్కీ ఫెలో అనే చెప్పాలి.  భూమికి గురుగ్రహం దగ్గరగా రావడం వల్ల మే షరాశి వారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వీరికి ఎన్నో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త  ఇప్పుడు మీకు అందే అవకాశం ఉంది. ఈ రాశి వారు కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం.

24
సింహ రాశి

గురుగ్రహం వల్ల సింహ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. బృహస్పతి శుభ దృష్టితో సింహరాశిపై అధికంగా ఉంటుంది. వీరికి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.  పూర్వీకుల నుంచి వీరికి  ఆస్తి దక్కే అవకాశం ఉంది. ఆ ఆస్తితో లాభాలు కూడా కలగవచ్చు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి తరుణం. సింహరాశి వారు విదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రయత్నం చేస్తే ఆ కల నెరవేరుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రయత్నించాలి.

34
ధనూ రాశి

ధనుస్సు రాశి వారు గురుగ్రహం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.  ఈ సమయం వారికి చాలా శుభప్రదమైనది. విద్య, పోటీ పరీక్షలు, కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో ఈ రాశుల వారు విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఇది కలిసి వచ్చే కాలం. వీరికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.  అదృష్టం ధనూ రాశి వారి వెంటే ఉంటుంది.

44
కుంభ రాశి

కుంభరాశి వారికి బృహస్పతి వల్ల అన్ని రకాలుగా కలిసి వస్తుంది.  వీరికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి.  వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. జీవితంలో స్థిరత్వం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల కుంభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories