జులై నెల రాశిఫలాలు

First Published | Jul 1, 2020, 8:19 AM IST

ఈ జులై నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొందును. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగచేయును.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి:- ఈ నెలలో ప్రశంసలు పొందుతారు. పై అధికారుల సూచనలు ఉపయోగపడును. మాసం చివరి వారంలో శుభాకార్యక్రమాలలో పాల్గొందురు. ఈ మాసంలో ప్రధమ వారం మంచి ఫలితాలు ఏర్పడవు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్ధిక సమస్యలకు, మానసిక అశాంతికి దారితీయు సూచనలు కలవు. ప్రేమ వ్యవహారముల వలన అపకీర్తి, గౌరవ హాని. మేషరాశి పురుషులకు పర స్త్రీ ఆకర్షణ వలన తీవ్ర సమస్యలు. ఉద్యోగ జీవనంలో భాద్యతలను చివరి నిమిషంలో పూర్తీ చేయగలుగుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృషభరాశి:- ఈ నెలలో నూతన అవకాశములు లభించును. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యాపార విస్తరణ అవకాశములు లభించును. విదేశీ విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్నపుర్వక లాభం ఏర్పడును. ఈ మాసంలో 2, 3, 8, 13 తేదీలు అంత అనుకూలమైనవి కావు. ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొందును. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగచేయును. భాత్రు వర్గం వారి సహకారంతో సమస్యలు పరిష్కారమగును. 10వ తేదీ తదుపరి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును.ఈ మాసం మొత్తం మీద ధనాదాయం కొంత తగ్గును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి:- ఈ నెలలో మన మాటే నెగ్గాలి అనే పట్టుదల పనికిరాదు. కఠిన నిర్ణయాల వలన నష్టం పొందు సూచనలు అధికంగా కలవు. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఆరుద్రా నక్షత్ర జాతకులకు సంతాన సంబంధ మానసిక అశాంతి ఏర్పడును. ఖర్మను మించి ఏమి పొందలేరని గ్రహించాలి. అంతగా అనుకూలమైనది కాదు. అనవసర విమర్శలు, అపవాదులు ఎదుర్కొందురు. కష్టానికి తగిన గుర్తింపు లభించదు. గృహంలో అనారోగ్య మూలక ఆందోళన ఉండును. సంతాన వ్యవహార తీరు అసహనం కలిగిస్తుంది. స్వయం నియంత్రణ అవసరం. ఈ మాసంలో 6, 9, 10, 15, 17, 26 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది
కర్కాటకరాశి:- ఈ నెలలో ముఖ్యమైన నిర్ణయాలను ఈ మాసంలో తీసుకొనవచ్చు. మొత్తం మీద ఈ మాసంలో తీవ్ర ఇబ్బందుల నుండి బయటపడతారు. దూర ప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఆదాయం పొందగలరు. నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఉద్యోగ జీవనంలో నిలకడ వస్తుంది. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగును. కుటుంబ విషయాలలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలలో పట్టు సాధిస్తారు. పరిస్థితులు అవగాహన అవుతాయి. సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి :-ఈ నెలలో కుటుంబ పెద్దల ప్రవర్తన వలన సమస్యలు. అనుకోని కలహాలకు అవకాశముంటుంది. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలలో ఓర్పు అవసరం. ధనాదాయం కొంత తగ్గును. చేపట్టిన పనులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగక ఇబ్బందులను ఎదుర్కొనును. తోటి ఉద్యోగుల నుండి రావలసిన సహకారం సకాలంలో లభించదు. ఆశించిన గుర్తుంపు లభించదు. నూతన అవకాశములు చేజారిపోవును. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. ఈ మాసంలో 2, 6, 7, 18, 25, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు. ఆర్ధికంగా వృధా ఖర్చులు ఏర్పడును. అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.
కన్యారాశి :- ఈ నెలలో సరైన ప్రణాళికల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిన్చుకొందురు. సంతాన ప్రయత్నాలు ఫలించవు. వివాహ ప్రయత్నాలలో ఓర్పు అవసరం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ధనాదాయం పెరుగును. ఋణ బాధలు తగ్గును. విద్యార్ధులకు చక్కటి అనుకూల కాలం. విశ్వ విద్యాలయ ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులరాశి :- ఈ నెలలో ఉద్యోగ జీవనం సామాన్య యోగాన్ని కలుగచేయును. ఆలోచనా విధానం బాగుండును. ఈ మాసంలో కూడా కుటుంబ సమస్యలు మానసికంగా చికాకులు కలుగచేయును. రక్త సంబంధీకుల పట్ల అభిమానం అవసరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన సంబంధిత విషయాలలో ప్రతికూల ఫలితాలు ఏర్పడును. సువర్ణ లేదా అధునాతన పరికరాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ మాసంలో 29, 30 తేదీలలో తలపెట్టు నూతన కార్యములు జయప్రదంగా కొనసాగుతాయి.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.
వృశ్చికరాశి :- ఈ నెలలో జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవనంలో సోఖ్యం. బాగా ఎదిగిన సంతానం వలన ఆర్ధిక లేదా వాహన ప్రయాణ సౌఖ్యం. కుటుంబ భాద్యతలను తీసుకొంటారు. స్థిరాస్తి తగాదాలలో రాజీ ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగ జీవనంలో ఆశించిన విధంగా పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లకు అవకాశములు ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఉన్నతి - నూతన భాద్యతలు లభిస్తాయి. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కొనసాగును. కుటుంబములో మీ మాట విలువ పెరుగును. విద్యార్ధులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. తృతీయ వారంలో విహార యాత్రలు, విందు - వినోదాల వలన సంతోషంగా సమయం గడచును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.
ధనస్సురాశి :- ఈ నెలలో వివాహ సంబంధ వివాద విషయములందు లాభములు పొందుతారు. ధనాదాయం కొంత వృద్ధి చెందును. వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనాలు బాగానే ఉండును. సంఘంలో చక్కటి పేరుప్రఖ్యాతలు లభించును. ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానములు ఏర్పడును. కుటుంబ సభ్యుల గౌరవం పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కోర్టు తగాదాలు, 15, 16, 17, 18 తేదీలలో శుభ వార్తలు వినుదురు. చివరి వారంలో చేయు ప్రయనములందు ఆకస్మిక నష్టం ఏర్పడు సూచన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకుపశు,పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి :- ఈ నెలలో అవసరాలకు రావలసిన ధనం అందుట కష్టం. హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోరు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ప్రధమ అర్ధభాగం అంత అనుకూలంగా ఉండదు. మకర రాశికి చెందిన స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలుగచేయును. ధనాదాయం తగ్గును. ద్వితీయ అర్ధ భాగం నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభమగును. నూతన కాంట్రాక్టులు పొందుతారు. సంతాన ప్రయత్నములు వంశ పెద్దల ఆశీస్శులతో విజయవంతం అవుతాయి. ఆర్ధిక విషయాలలో కూడా అనుకూలత పొందుతారు. చివరి వారం స్థానచలన ప్రయత్నాలకు మంచి కాలం. ఈ మాసంలో దంత సంబంధ సమస్యల వలన ఇబ్బడి పడుదురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి :- ఈ నెలలో అధికారులతో వివాదాలు తొలగును. ధనాదాయం బాగుండును. సినీరంగ వ్యాపారములు చేయు వారికి మాత్రం ఆశించిన లాభములు లభించుట కష్టం. పెట్టుబడులు పెట్టుటకు ముందు పెద్దల సలహాలు పాటించుట మంచిది. శరీర ఆరోగ్యం సహకరించును. సంతానం వలన మానసిక ఉల్లాసం లభించును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో బంధు మిత్రుల కలయిక ఏర్పడును. పితృ వర్గీయుల కొరకు ధన వ్యయం ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధ స్థాన చలన ప్రయత్నములకు ద్వితీయ , తృతీయ వారములు అనుకూలంగా ఉండును. తలపెట్టిన పనులలో ఏర్పడుతున్న ఆటంకములు తొలగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి :- ఈ నెలలో ప్రతిబంధక వ్యవహారాలు వాయిదా పడును. జీవన స్థితిపై మెరుగైన ఆలోచనలు ఉంటాయి. శస్త్ర చికిత్స తప్పిపోవును. విమర్శలకు దూరంగా ఉంటారు. జ్ఞాపక శక్తితో ముఖ్యకార్యక్రమాలు నెరవేరును. నూతన ప్రయత్నములలో సులువుగా విజయం చేకూరును.కూడా గత మాసపు అనుకూల ఫలితాలు కొనసాగును. ధనాదాయం సామాన్యం. ద్వితీయ వారంలో కుటుంబంలోని పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగములు. 4,7,13,17,22 తేదీలలో వృత్తి వ్యాపారాలలో చక్కటి ధన ఆదాయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

Latest Videos

click me!