
1.మేష రాశి...
మేష రాశివారిపై మీరు ఎప్పుడూ ఎలాంటి గ్రడ్జ్ పెట్టుకోకూడదు. వారిపై మీరు గ్రడ్జ్ పెంచుకుంటే.. అది మీకే మంచిది కాదు. దీని వల్ల మీకే చెడు జరిగే అవకాశం ఉంటుంది.
2.వృషభ రాశి..
వృషభ రాశివారికి ఓపికతో ఉండేవారంటే ఎంత ఇష్టమో... ఓపికతో లేనివారు తమచుట్టూ ఉండటం వారికి నచ్చదు. మీకు ఓపిక లేకుండా, అసహనం ఎక్కువగా ఉంటే...వృషభ రాశివారికి దూరంగా ఉండాలి. లేదంటే... మీకే చెడు జరిగే అవకాశం ఉంది.
3.మిథున రాశి..
మిథున రాశివారు దేనినైనా సహిస్తారు. కానీ... తమను ఎవరైనా ఇగ్నోర్ చేస్తే మాత్రం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. ఆ విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు నమ్మకానికి ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టి... ఎవరైనా వారికి ద్రోహం చేయాలని చూస్తే...ఈ రాశివారికి అస్సలు నచ్చదు. అలా చేస్తే మీకే నష్టం కలుగుతుంది.
5.సింహ రాశి..
సింహ రాశివారికి తమను ఎవరైనా తప్పుగా చూసినా, నేరం చేసిన వారిలా చూసినా... ఈ రాశివారికి అస్సలు నచ్చదు. చాలా కోపంగా, పిచ్చిపట్టినట్లుగా ఈ రాశివారు ప్రవర్తిస్తారు.
6.కన్య రాశి..
కన్య రాశివారికి అబద్ధాలు అంటే చాలా కోపం, అసభ్యం. కాబట్టి... ఈ రాశివారికి అబద్దం చెప్పే సాహసం చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల మీకే చెడు జరిగే ప్రమాదం ఉంటుంది.
7.తుల రాశి..
తుల రాశివారిని ఎప్పుడూ అసహ్యించుకోకూడదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా.. ఒత్తిడికి గురైనా.. వారు తీసుకునే నిర్ణయాలు మీకు నచ్చలేదని.. వారిని ద్వేషించకూడదు. అది భవిష్యత్తులో మీకే సమస్యలు తెస్తోంది.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి రహస్యాలు అంటే నచ్చదు. ఎవరైనా తమ దగ్గర రహస్యాలు దాచినా... తమ దగ్గర ఏమైనా దాచాలని చూసినా అస్సలు నచ్చదు. కాబట్టి... అలాంటి పనులు చేయకపోవడమే మంచిది.
9.ధనస్సు రాశి...
ఈ రాశివారికి ఎవరైనా వేరే వారిలా నటించడం లాంటివి చేస్తే నచ్చదు. ఇతరుల్లా నటించేవారిని చూస్తే ఈ రాశివారు అసహ్యించుకుంటారు. కాబట్టి... వీరి ముందు నటించకూడదు. మీరు మీలా ఉండాలి.
10.మకర రాశి..
వ్యక్తిగతంగానూ... వృత్తిపరంగానూ కూడా... ఎవరైనా తాము చేసే కృషిని ఎవరైనా ఇగ్నోర్ చేస్తే... ఈ రాశివారికి అస్సలు నచ్చదు. వీరి విషయంలో వీరి ఎఫర్ట్స్ ని గుర్తించకపోతే తట్టుకోలేరు. కాబట్టి.. వీరి ఎఫర్ట్స్ ని మీరు గుర్తించాలి.
11.కుంభ రాశి...
కనీసం ఊపిరాడకుండా.. తమను ఎవరైనా అతుక్కుని ఉండటం వీరికి నచ్చదు. అలాంటి వారు తమ చుట్టూ ఉంటే... వారికి దూరంగా ఉండాలని ఈ రాశివారు భావిస్తూ ఉంటారు.
12.మీన రాశి...
ఈ రాశివారు తాము పడిన కష్టం వృథా అవ్వడాన్ని తట్టుకోలేరు. అలా తమ కష్టాన్ని ఎవరైనా వృథా చేసినట్లుగా అనిపిస్తే వీరు వారిని అస్సలు వదిలిపెట్టరు.