పలు గ్రంథాల ప్రకారం.. కొన్ని జంతువులు, పక్షులు ఇంటికి రావడం గురించి ఎన్నో సంకేతాలు వివరించబడ్డాయి. వీటిలో కొన్ని సంకేతాలను గుడ్లగూబలు కూడా ఇస్తాయి. గుడ్లగూబలు ఎక్కువగా మన ఇంటి పైకప్పు లేదా బాల్కనీలో కూర్చొని కనిపిస్తుంటాయి. మరి ఇంటికి గుడ్లగూబ రాక మంచిదా? చెడా? దీనిపై జ్యోతిష్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
లక్ష్మీదేవి రాక
ఇంటికి లక్ష్మీదేవి రాక కోసం ఎన్నో పూజలు చేస్తుంటాం. ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. ఎందుకంటే అమ్మావారి ఇంట్లో ఉంటే ఇంట్లో డబ్బుకు, సుఖ శాంతులకు ఎలాంటి కొదవ ఉండదనే నమ్మకం ఉంది. అయితే మీ ఇల్లు లేదా ఇంటి చుట్టూ తెల్ల గుడ్లగూబ కనిపిస్తే.. అది లక్ష్మీదేవికి, ఆమె వాహనానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఇది శుభ సంకేతం.
Owl
ధన లాభం
పురాణాల ప్రకారం.. గుడ్లగూబ తరచుగా కనిపించడం లేదా గుడ్లగూబ ఇంటికి రావడం శుభసూచకంగా భావిస్తారు. దీని అర్థం మీరు అపారమైన సంపదను పొందబోతున్నారు. కాబట్టి మీరు మీ ఇంటి చుట్టుపక్కల గుడ్లగూబను చూస్తే సంతోషించాలి.
Owl
సానుకూల మార్పులు
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పగటిపూట గుడ్లగూబలు మీ ఇంటి దగ్గర కనిపించినా లేదా పగటిపూట ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా.. మీ జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ఇది మీకు మంచి రోజులు ప్రారంభమవడాన్ని సూచిస్తుంది.
ఉద్యోగంలో విజయం సాధిస్తారు
పురాణాల ప్రకారం.. రాత్రిపూట గుడ్లగూబను చూస్తే చాలా మంచిదని భావిస్తారు. ఇది మీ విజయాన్ని సూచిస్తుంది. అవును రాత్రిళ్లు మీరు ఎక్కడైన గుడ్లగూబను చూసినట్టైతే మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు.
ఆర్థిక సంక్షోభం
నైరుతి దిశలో గుడ్లగూబ కనిపించడం లేదా అదే దిశ నుంచి గుడ్లగూబ శబ్దం రావడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.
రుణం నుంచి విముక్తి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గుడ్లగూబ మీరు వెళ్లే దారిలో కనిపిస్తే.. ఆగిపోయిన మీ పని త్వరలోనే పూర్తి కాబోతోందని అర్థం చేసుకోండి. అలాగే మీరు అప్పుల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది.
owl
డబ్బు తిరిగి వస్తుంది
మార్గ మధ్యంలో గుడ్లగూబ ఎగురుతూ కనిపిస్తే అది సంపదకు చిహ్నంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో నిలిచిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది.