ఈ వాస్తు మార్పులు చేసుకుంటే... ఆ ఇంట సంతోషం వెల్లివిరిస్తుంది..!

First Published Jun 29, 2021, 3:17 PM IST

బెడ్ రూమ్ ఎల్లప్పుడూ తూర్పు లేదా దక్షిణ దిశగా ఉండాలి. మనం ఏ వైపు పడుకున్నా, మంచం ఆ వైపు గోడ ఉంటే అది మంచిది

మనలో చాలా మంది అనేక సమస్యలతో సతమతమౌతూ ఉంటారు. అసలు ఆ సమస్య ఎక్కడ మొదలైంది.. దేని వల్ల వచ్చిందనే విషయం కూడా అర్థం కాదు. కానీ.. ఇంట్లో మాత్రం సంతోషం ఉండదు. ఎంత కష్టపడినా.. రూపాయి ఇంట్లో నిలవదు. నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమౌతున్నారా..? అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
బెడ్ రూమ్ ఎల్లప్పుడూ తూర్పు లేదా దక్షిణ దిశగా ఉండాలి. మనం ఏ వైపు పడుకున్నా, మంచం ఆ వైపు గోడ ఉంటే అది మంచిది. మంచం చెక్కతో తయారుచేసినదై ఉండాలి.
undefined
నిద్రపోతున్నప్పుడు మనం దాదాపు ధ్యానస్థితిలో ఉంటాం. ఆ సమయంలో శరీరంలోకి శక్తి ప్రవహిస్తుంది. ఆ సమయంలో మనం చెక్కతో చేసిన బెడ్ పై పడుకుంటే.. ఆ శక్తి మనకు చేరుతుంది. అలా కాకుండా.. ఇనుము లాంటి వేరే ఏదైనా లోహంతో చేసిన మంచం అయితే.. ఆ శక్తి మొత్తం ఆ లోహం లాగేసుకుంటుంది.
undefined
ఇక పడకగది ఎప్పుడూ లేత రంగులే ఉండేలా ఎంచుకోవాలి. ముఖ్యంగా తెలుపు రంగు ఎంచుకోవడం ఉత్తమం.
undefined
పడక గదిలో.. డ్రెస్సింగ్ టేబుల్ లేకుండా ఉండటమే మంచిది. అలా కాకుండా.. ఒక వేళ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే.. పడుకునే ముందు.. దానికి ఉన్న అద్దానికి ఏదైనా ముసుగు కప్పి ఉంచాలి. మంచి మీద పడుకొని.. అద్దంలో చూసుకోకూడదు.
undefined
బెడ్రూంలో చాలా మంది అందంగా కనిపించేందుకు రకరకాల బొమ్మల పెయింట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే..వ వాటిల్లో జంతువులు, ఏదైనా యుద్ధానికి సంబంధించినవి లేకుండా చూసుకోవాలి. కావలంటే పూలు లాంటి ఫోటోలు పెట్టుకోవడం ఉత్తమం.
undefined
ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే.. అది అద్దం ద్వారా రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. మంచం మీద పడుకుంటే.. అద్దం కనపడకూడదని చెబుతుంటారు.
undefined
బెడ్రూం కిటికీని ఎక్కువ సేపు తెరచి ఉంచడం మంచిది.
undefined
విద్యార్థులు అయితే.. తూర్పు వైపు తిరిగి పడుకోవడం చాలా మంచిది. ఉద్యోగాలు చేసేవారైతే.. దక్షిణం వైపు తిరిగి పడుకోవడం మంచిది.
undefined
గోడ గడియారం ఇంటికి ఉత్తరం వైపు ఉండటం మంచిది.
undefined
చేపలు.. అంటే ఎక్వేరియం లాంటివి బెడ్రూమ్ లో పెట్టకపోవడమే మంచిది. కావాలంటే హాల్, లివింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు.
undefined
click me!